Adilabad Politics : ఆదిలాబాద్ లో గెలుపెవరిది? బీజేపీకి ఛాన్స్ ఇస్తారా- కాంగ్రెస్ కు కట్టబెడతారా?
Adilabad Politics : సెంట్రల్ ఇండియాకు గేట్ వే అయిన ఆదిలాబాద్ లో గెలుపుపై ఆసక్తి నెలకొంది. సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేస్తుంటే, అసెంబ్లీ ఎన్నికల విషయం జోష్ లో ఉన్న కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది.
Adilabad Politics : తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్(Adilabad) ప్రత్యేకమైనది. సెంట్రల్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకు ఆదిలాబాద్ 'గేట్ వే'గా ఉంది. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో సరిహద్దు కలిగిన ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాలు, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లు, నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్ శాసనసభ నియోజక వర్గాలున్నాయి. గిరిజన తెగలకు చెందిన వాళ్లు ఎక్కువగా నివసించే ప్రాంతం కావటంతో ఆదిలాబాద్ ఎంపీ స్థానం(Adilabad MP Seat) ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ కు 17 సార్లు ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 6 సార్లు, బీఆర్ఎస్ రెండు సార్లు గెలుపొందాయి. కాంగ్రెస్, సోషలిస్ట్ పార్టీ, బీజేపీ ఒక్కొక్క సారి విజయం సాధించాయి. గడిచిన ఎన్నికలను పరిశీలిస్తే ఒక్కొక్క సారి ఒక్కో పార్టీకి అవకాశం కల్పించాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో అభ్యర్థుల్లో, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. మరి ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎవరిని గెలిపిస్తారోనని పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు.
సిట్టింగ్ కోసం బీజేపీ ప్రయత్నాలు
సిట్టింగ్ స్థానం చేజారకుండా... బీజేపీ(BJP) ప్రయత్నం చేస్తోంది, అదిలాబాద్ (Adilabad MP Seat)పార్లమెంటు సీటును ఎలాగైనా రెండోసారి కైవసం చేసుకోవడానికి బీజేపీ కృషి చేస్తోంది. ఎట్టి పరిస్థితులలో రెండోసారి పాగా వేయడానికి కసరత్తు చేస్తుంది. అదేవిధంగా ఆదివాసి గోండులను(Gond) కాంగ్రెస్ (Congress)తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రతి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ నుంచి ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదివాసి కావడంతో స్థానిక ఓట్లు కాంగ్రెస్ వైపే వస్తాయని ఆశిస్తున్నారు. మరోవైపు అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడడం ఎస్టీ లంబాడలకు ప్రధాన పార్టీలు టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్ గా పోటీలో నిల్చోని లంబాడ ఓట్లను, జనరల్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు.
రిపోర్టింగ్ ; వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం