Adilabad MP Candidates: ప్రధాన పార్టీల్లో ఆదిలాబాద్ లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి!
Adilabad MP Candidates: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి మూడు ప్రధాన పార్టీలు తలపడనున్నారు. అభ్యర్థుల ఎంపిక కూడా కొలిక్కి వచ్చింది.
Adilabad MP Candidates: లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో పోటీకి ప్రధాన పార్టీలు అభ్యర్థుల Candidates ఎంపికపై కసరత్తు పూర్తి చేశాయి. సామాజిక, రాజకీయ అంచనాల ప్రకారం వివిధ సర్వేలు జరిపి అభ్యర్థుల ఎంపికను చేపడుతున్నారు, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ స్థానం బీజేపీ BJP కావడం తో ఆ పార్టీ గత నెల రోజులుగా సర్వేలు చేపడుతోంది.
పార్టీలు ఎంపికను అన్ని పార్టీలు ప్రతిష్టత్మాకంగా తీసుకొంటున్నారు. ఇదే తీరుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అభ్యర్థి ఎంపికను ఆచితూచి అడుగులు వేస్తూ సర్వేలు చేపడుతూ పేర్లను రహస్యంగా ఉంచుతున్నారు.
బిఆర్ఎస్ BRS పార్టీ నాయకత్వం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ టికెట్ కేటాయించింది. భారతీయ జనతా పార్టీ నుండి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ బిఆర్‌ఎస్ ఎంపీ గడెం నగేష్ కు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు దాదాపు ఖరారు అయిందని, అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అధికార కాంగ్రెస్ Congress పార్టీ ఆచితూచి అడుగులు వేస్తూ గడం నగేష్ గోండు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జో పటేల్ ను దింపితే గెలుపు సాధ్యమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు టిఆర్ఎస్, బిజెపి పార్టీలు గోండు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని పోటీలోకి దింపడంతో లంబాడ సామాజ ఎవరికైనా చెందిన వ్యక్తిని రంగాల్లోకి దింపి ఎంపీ సీటును కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.
లంబాడ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్ ఇప్పటికే టికెట్ పై ఆశలు పెట్టుకొని విస్తృత ప్రచారం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది, ఒకవేళ రేఖా నాయకు టికెట్లు దొరికితే గెలుపు ఓటములు ఏవిధంగా ఉంటాయనేది ప్రజల్లో చర్చ కొనసాగుతోంది.
ఆదిలాబాద్ పార్లమెంటులో మొత్తం 7 సెగ్మెంట్లు ఉండగా ఇందులో ఒక సెగ్మెంట్ కాంగ్రెస్, నాలుగు సెగ్మెంట్లు బిజెపికి, ఒక సెగ్మెంట్ టిఆర్ఎస్ కు దక్కాయి. నాలుగు సెగ్మెంట్లలో బిజెపి పార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఎట్టి పరిస్థితులలో ఎంపీ సీటు తామే కైవసం చేసుకుంటున్నట్లు బిజెపి శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు అధిష్టానం పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో తన అడుగులు ఎటువైపు ఉంటాయని ప్రజలు గమనిస్తున్నారు,
లోకసభ ఎన్నికలకు రెండు మూడు రోజులలో షెడ్యూల్ జారీ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ లో అభ్యర్ధుల ఎంపికపై ఉత్కంఠత నెలకొంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్లపైనే ప్రధానంగా గురిపెట్టి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది.
44 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఎన్నికల కమిటి రెండో జాబితా విడుదల చేసినప్పటికి తెలంగాణ నుండి ఈ జాబితాలో ఎవరికీ చోటు దక్కలేదు. బిజెపి సిట్టింగ్ సీటుపై పాగా వేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ దరఖాస్తుల వడపోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క ఆదిలాబాద్ పార్లమెంటు నియోజక వర్గంలో ఒకే ఒక సీటుతో గెలిచిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుతోపాటు రాష్ట్ర కమిటీ నేతలు ప్రత్యేక దృష్టి సారించి సామాజిక సమీకరణల కోణంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.
గత లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకోగా ఈసారి ఎన్నికల్లో బిఆర్ఎస్ డీలా పడినందున బిజెపితో నువ్వానేనా అన్న రీతిలో పోటి సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా బిజెపి నుండి ఆదివాసీ అభ్యర్థినే ఖరారు చేస్తే కాంగ్రెస్ నుండి లంబాడ అభ్యర్థిని రంగంలోకి దించడం వల్ల ఫలితాలు రాబట్టవచ్చని అధిష్టానం పెద్దలు అంచనా వేస్తున్నారు.
ఆదిలాబాద్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 10 మంది ఉద్యోగులు, అధికారులే ఉండటం గమనార్హం. పార్టీకీ సంబంధం లేకుండా కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడ నోచుకోకుండా దరఖాస్తు చేసుకున్నవారిని దూరం పెట్టి పార్టీ జెండా మోసిన వారికి టికెట్టు ఇవ్వాలన్న బలమైన అభిప్రాయం పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతుంది.
కీలక దశకు చేరిన కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ సీటున టార్గెట్ గా చేసుకుని వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్న 22 మందిలో వడపోత అనంతరం ఆరుగురి పేర్లను ఢిల్లీ స్క్రీనింగ్ కమిటికి నివేదించారు.
గిరిజన తెగల ఆదిపత్య పోరులో అభ్యర్థిత్వం ఖరారుపై చిక్కుముడి నేతలకు తలనొప్పిగా మారింది. బోథ్ అసెంబ్లీ టికెట్ను ఆశించి భంగపడ్డ ఎఐసీసీ సభ్యుడు నరేష్ జాదవ్ ఢిల్లీ హైకమాండ్ పెద్దలతో కలుస్తూ ఈసారి టికెట్ తనకే ఇవ్వాలన గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు.
మరోవైపు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే మహిళా కోటా కింద ఈసారి టికెట్టు ఇస్తే లంబాడాలు, గిరిజనేతరులు ఓట్ల మద్దతుతో గెలిచి తీరుతానని నేతలముందు పావులు కదు పుతున్నారు. ఆదివాసీ తెగ నుంచి ఆత్రం భాస్కర్, ఆ సుగుణ, మర్సకోల తిరుపతి, తదితర నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు..
(రిపోర్టింగ్ వేణుగోపాల్ కామోజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా)
సంబంధిత కథనం