Elections in Telugu States : ఎన్నికల వేళ ప్రయాణికుల రద్దీ - 22 రైళ్లకు అదనపు కోచ్‌లు
SCR Additional Coaches : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ వేళ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా… ప్రస్తుతం నడుస్తున్న 22 రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
ఎన్నికల వేళ రైళ్లకు అదనపు కోచ్‌లు
మే 10 నుంచి 14 వరకు పలు మార్గాల్లో ఈ అదనపు కోచ్ లు సేవలు అందిస్తాయి. వీటిలో 3 ఏసీ, సెకెండ్ ఏసీ, స్లీపర్, చైర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. ఈ రైళ్ల వివరాలను కింద ఇచ్చిన ట్వీట్ లో చేసుకోవచ్చు.
వేసవి ప్రత్యేక రైళ్లు….
వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. మే 9వ తేదీన( ట్రైన్ నంబర్ 07025 ) రాత్రి 8.30 కాచిగూడలో బయలుదేరే స్పెషల్ ట్రైన్…. ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 10వ తేదీ(ఈ ట్రైన్ 07026 నంబర్) సాయంత్రం 5.10కి కాకినాడ టౌన్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 4.50కి కాచిగూడకు చేరుతుంది.
- మే 10వ తేదీ రాత్రి 9.20కి సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్(ట్రైన్ నంబర్ 07271) బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు 07272 నంబర్‌తో 11వ తేదీ రాత్రి 9గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కు సికింద్రాబాద్ చేరుతుంది.
- మే 11వ తేదీన రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలు(ట్రైన్ నంబర్ 07175 ) బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.35కు నర్సాపూర్ చేరుతుంది. ఈ ట్రైన్ మే 13న సాయంత్రం 6గంటలకు నరసాపూర్‌లో బయలుదేరి(07176 నంబర్‌తో ) మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. మే 13వ తేదీన నాందేడ్‌లో మధ్యాహ్నం 2.25కు స్పెషల్ ట్రైన్(ట్రైన్ నంబర్ 07487) బయల్దేరుతుంది.
- మరుసటి రోజు ఉదయం 8.10కి కాకినాడ టౌన్‌కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో చూస్తే మే 14వ తేదీన(ట్రైన్ నెబంర్ 07488 నంబర్ ) సాయంత్రం 6.30కి కాకినాడ టౌన్‌లో బయలుదేరి మరుసటి రోజు మధాŠయ్‌హ్నం 3.10కి నాందేడ్ చేరుకుంటుంది.
- మరోవైపు తిరుపతి - శ్రీకాకుళం మధ్య స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు మే 05 నుంచి 12వ తేదీ వరకు ప్రతి ఆదివారం సేవలు అందించనుంది. ఇక శ్రీకాకుళం నుంచి తిరుపతికి కూడా (07441) కూడా స్పెషల్ ట్రైన్ ఉండనుంది.
- సికింద్రాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక వారాంతపు రైళ్లను నడపనుంది. 07234 నంబర్ గల రైలు ఏప్రిల్ 28 నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్ నుంచి సంత్రగచి (Santragachi) వరకు నడుస్తుందని విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మండ్రూకర్ వెల్లడించారు.