Amit Shah in Telangana : ఈసారి తెలంగాణలో 10కి పైగా సీట్లు గెలుస్తాం - భువనగిరి సభలో అమిత్ షా
- Amit Shah Campaign in Telangana : తెలంగాణలో బీజేపీ అగ్రనేతల ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్న పలు సభల్లో మోదీ పాల్గొనగా… ఇవాళ అమిత్ షా భువనగిరిలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
- Amit Shah Campaign in Telangana : తెలంగాణలో బీజేపీ అగ్రనేతల ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్న పలు సభల్లో మోదీ పాల్గొనగా… ఇవాళ అమిత్ షా భువనగిరిలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
(1 / 5)
భువనగిరిలో తలపెట్టిన సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ప్రధాని మోదీని మూడోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 400 సీట్లను సాధించాలంటే భువనగిరిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.(Image Source Amit Shah FB)
(2 / 5)
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని 10కి పైగా లోక్‌సభ స్థానాలతో ఆశీర్వదించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, బుజ్జగింపు రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు.(Image Source Amit Shah FB)
(3 / 5)
తెలంగాణలో గత ఎన్నికల్లో బీజేపీ 4 లోక్‌సభ సీట్లు గెలిచిందని అమిత్ షా గుర్తు చేశారు. ఈసారి 10కి పైగా గెలుస్తామని చెప్పారు.(Image Source Amit Shah FB)
(4 / 5)
కాంగ్రెస్,బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య బంధం ఉందని ఆరోపించారు అమిత్ షా. మూడు పార్టీలు హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించవని గుర్తు చేశారు. రద్దు చేసిన ట్రిపుల్ తలాక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.(Image Source Amit Shah FB)
(5 / 5)
ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్... ఈ మూడు పార్టీలు ఒక్కటే అని చెప్పారు అమిత్ షా. వీరి మధ్య త్రికోణ బంధం ఉందన్నారు. శ్రీరామనవమి నిర్వహిస్తే ఈ పార్టీలు ఆంక్షలు విధిస్తారని అన్నారు. సీఏఏను వ్యతిరేస్తున్నారని విమర్శించారు. ఈ మూడు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. (Image Source Amit Shah FB)
ఇతర గ్యాలరీలు