Telangana Elections 2023 : మొత్తం 4,798 నామినేషన్లు దాఖలు.. అత్యధికంగా గజ్వేల్, మేడ్చల్ లోనే
Nominations in Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. అత్యధికంగా గజ్వేల్, మేడ్చల్, కామారెడ్డిలో దాఖలయ్యాయి.
Telangana Assembly Elections 2023: తెలంగాలో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా…. మొత్తం 5,716 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అత్యధికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో నామిషన్లు వేశారు.
గజ్వేల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 145 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇక కేసీఆర్ పోటీ చేస్తున్న మరో స్థానం కామారెడ్డిలోనూ 92 మంది నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 116 మంది నామినేషన్లు వేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తుండగా… గజ్వేల్ నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
LB నగర్ నియోజకవర్గంలో 77, మునుగోడులో 74 , సూర్యాపేటలో -68 , మిర్యాలగూడలో 67, నల్లగొండ నుంచి 64 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా నారాయణపేట్ నియోజకవర్గంలో 13 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. నవంబరు 30వ తేదీన పోలింగ్ ప్రక్రియ ఉండగా… డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి 30 మంది భారీ కోటీశ్వరులు బరిలో ఉన్నారు. అఫిడవిట్లలో వారి ఆస్తుల వివరాలను వెల్లడించారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల ఆస్తులు:
పైళ్లా శేఖర్ రెడ్డి - రూ.227 కోట్లు
కె.ప్రభాకర్ రెడ్డి - రూ.197 కోట్లు
బి.గణేష్ - రూ.124.4 కోట్లు
జనార్ధన్ రెడ్డి - రూ.112.3 కోట్లు
రాజేందర్ రెడ్డి - రూ.111.2 కోట్లు
మర్రి రాజశేఖర్ రెడ్డి - రూ.97 కోట్లు
సీహెచ్.మల్లారెడ్డి - రూ.95.94 కోట్లు
కె.ఉపేందర్ రెడ్డి - రూ.89.57 కోట్లు
బండారు లక్ష్మారెడ్డి - రూ.85.75 ఓట్లు
ఎ.గాంధీ - రూ.85.14 కోట్లు
బీజేపీ అభ్యర్థులు :
ఎం.రవి కుమార్ యాదవ్ - రూ.166.63 కోట్లు
ధర్మపురి అరవింద్ - రూ.107.43 కోట్లు
ఈటల రాజేందర్ - రూ.53.94 కోట్లు
మర్రి శశిధర్ రెడ్డి - రూ.51.14 కోట్లు
కె.వెంకటరమణ రెడ్డి - రూ.49.71 కోట్లు
వి.రఘునాథ రెడ్డి - రూ.48.18 కోట్లు
బేతి సుభాష్ రెడ్డి - రూ.42.55 కోట్లు
పి. కాళ్ల ప్రసాద్ రావు - రూ.39.88 కోట్లు
వి.మోహన్ రెడ్డి - రూ.38.68 కోట్లు
నివేదిత - రూ.34.95 ఓట్లు
కాంగ్రెస్ అభ్యర్థులు :
వివేక్ వెంకట స్వామి - రూ.606 కోట్లు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - రూ.458.9 కోట్లు
పి.శ్రీనివాస్ రెడ్డి - రూ.433.3 కోట్లు
జి.వినోద్ - రూ.197.12 కోట్లు
వి.జగదీశ్వర్ గౌడ్ - రూ.124.14 కోట్లు
ఎం.సునీల్ కుమార్ - రూ.104.13 కోట్లు
పి.సుదర్శన్ రెడ్డి - రూ.102.20 కోట్లు
కె.హన్మంతు రెడ్డి - రూ.95.34 కోట్లు
ఎం.రంగారెడ్డి - రూ.83.78 కోట్లు
కె.మదన్ మోహన్ రావు - రూ.71.94 కోట్లు