KCR Meeting in Narsapur : సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం - వ్యక్తి అరెస్ట్!-bullets were found in kcrs meeting held in narsapur ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kcr Meeting In Narsapur : సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం - వ్యక్తి అరెస్ట్!

KCR Meeting in Narsapur : సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం - వ్యక్తి అరెస్ట్!

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 17, 2023 11:11 AM IST

Telangana Assembly Elections 2023:ప్రజా ఆశీర్వాద సభ నర్సాపూర్‌లో జరిగింది. ఈ సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడ్డాయి. సభకు వచ్చిన అస్లాం అనే వ్యక్తి నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

BRS Praja Ashirvada Sabha at Narsapur: నర్సాపూర్ తలపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో బుల్లెట్లు కలకలం రేపాయి. అస్లాం అనే వ్యక్తి నుంచి రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నర్సాపూర్ సభా ప్రాంగణంలో బుల్లెట్లు దొరకటం సంచలనంగా మారింది. అస్లాంను అదుపులోకి తీసుకున్న పోలీసులు… అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అన్ని కోణాల్లో విచారణ…

పోలీసుల అదుపులో ఉన్న అస్లాం... సంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు అస్లాం. అయితే కేవలం బుల్లెట్లు మాత్రం దొరికాయని... తుపాకీ లేదని గుర్తించారు. అయితే బుల్లెట్లను అస్లాం ఎందుకు తీసుకువచ్చాడని ప్రశ్నార్థకంగా మారింది. ఇక నర్సాపూర్ సభకు భారీగా జనం తరలిరావటంతో.... ప్రతి ఒక్కరిని చెక్ చేసి పంపటం కష్టంగా మారిందని సమాచారం. అయితే సభ జరుగుతున్న సమయంలోనే అస్లాంను గుర్తించగా... సభకు అటంకం కలగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎర్రవల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్

మరోవైపు ఇవాళ నాలుగు సభలకు హాజరయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్. తొలుత ఆదిలాబాద్, బోథ్ సభలలో మాట్లాడారు. ఆ తర్వాత నిజామాబాద్ రూరల్ సభలో పాల్గొన్న కేసీఆర్… చివరిగా నర్సాపూర్ సభకు హాజరై ప్రసంగించారు. అయితే నర్సాపూర్ సభలో బుల్లెట్లు దొరకటం సంచలన పరిణామంగా మారింది. సభ తర్వాత…. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక బుల్లెట్ల వ్యవహరంపై జిల్లా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సభకు వచ్చిన వారి వివరాలపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహరంపై పోలీసు శాఖ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

Whats_app_banner