Rampachodavaram TDP: రంపచోడవరం టీడీపీ అభ్యర్ధిగా అంగన్‌వాడీ టీచర్... ఎమ్మెల్సీ అనంతబాబే అసలు టార్గెట్
Rampachodavaram TDP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆసక్తికరమైన పోటీ నెలకొన్న నియోజక వర్గాల్లో రంపచోడవరం నియోజక వర్గం ఒకటి. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య వ్యవహారంతో వార్తల్లోకి వచ్చిన నియోజక వర్గంలో టీడీపీ అభ్యర్ధిగా అంగన్‌వాడీ టీచర్‌ను ఎంపిక చేశారు.
Rampachodavaram TDP: టీడీపీ రెండో జాబితాలో రంపచోడవరం నియోజక వర్గం నుంచి అండన్ వాడీ టీచర్‌ను అభ్యర్ధిగా ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏజెన్సీ ప్రాంతంలో తిరుగులేని పెత్తనం చెలాయిస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబుMLC Anant Babu ను ఎదుర్కోడానికి టీడీపీ సాధారణ గృహిణిని పోటీకి దింపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం గత రెండేళ్లుగా వార్తల్లో ఉంటోంది. కారు డ్రైవర్ Car Driver హత్య తర్వాత రంపచోడవరం పాపులర్ అయ్యింది.
అంతకుముందు ఎవరికి పెద్దగా పట్టని మారుమూల నియోజక వర్గంలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం Subrahmanyam హత్యోదంతం తర్వాత చర్చగా మారింది. ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య తర్వాత రంపచోడవరం నియోజక వర్గం వార్తలోకి వచ్చింది.
డ్రైవర్‌ను కొట్టి చంపేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు, రంప చోడవరం ప్రాంతాన్నికొన్నేళ్లుగా రాజకీయంగా శాసిస్తున్నారు. కారు డ్రైవర్‌గా పనిచేసే సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని హత్యచేసి అదే కారులో అతని ఇంటి వద్ద డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు.
గత కొన్నేళ్లుగా నియోజక వర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపిక నుంచి గెలుపు వరకు అనంతబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గం నాయకులకు సమీప బంధువైన అనంతబాబు ఏజెన్సీ ప్రాంతాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య తర్వాత అనంతబాబు రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా వైసీపీ అతడిని పార్టీలో కొనసాగించింది.
ఈ నేపథ్యంలో రంపచోడవరంలో వైసీపీ YCP హవాకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో టీడీపీ అభ్యర్ధిగా ఓ అండన్వాడీ టీచర్‌ను బరిలో దింపింది. ఎస్టీ రిజర్వుడు నియోజక వర్గమైన రంపచోడవరంలో మిరియాల శిరీషాదేవిని టీడీపీ అభ్యర్థిగా రెండో జాబితాలో ప్రకటించారు.
అంగన్‌వాడీ కార్యకర్తగా కొన్నేళ్లుగా పిల్లలకు పాఠాలు చెప్పిన శిరీషా గత ఏడాది డిసెంబర్‌లో రాజకీయ కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజవొమ్మంగి మండలం అనంతగిరిలో ఎనిమిదేళ్లుగా శిరీషాదేవి Sirisha Devi అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తోంది. ఆమె భర్త విజయభాస్కర్ నియోజకవర్గంలో తెలుగుయువత అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో ఆమె రాజకీయ వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
భర్త రాజకీయాల్లో ఉండటంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌కు గురైనట్టు తెలిపారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారాలు చేశారని టీడీపీ చెబుతోంది. విధులకు హాజరు కావడం లేదనే ఫిర్యాదులపై పలుమార్లు అధికారుల విచారణకు హాజరయ్యారు. రాజకీయ ఫిర్యాదుల నేపథ్యంలో మెమోలు అందుకోవాల్సి వచ్చింది. శిరీషా దేవిని విధుల నుంచి తొలగించడానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులపై ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశారు. దీంతో గత ఏడాది ఉద్యోగానికి రాజీనామా చేశారు.
రంపచోడవరంలో నెలకొన్నపరిస్థితుల నేపథ్యంలో స్థానికురాలు కావడం, అనంతబాబు వర్గానికి ఎదురొడ్డి నిలిచారనే కారణంతో ఆమెను ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఎంపిక చేశారు. గత మూడు ఎన్నికల్లో రంపచోడవరంలో టీడీపీ అభ్యర్తులు గెలవలేదు. 1983 నుంచి 2004 వరకు ఏజెన్సీలో టీడీపీ వరుసగా గెలిచింది. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపొందాడు. 2014లో వైసీపీ అభ్యర్ధి రాజేశ్వరి, 2019లో నాగులపల్లి ధనలక్ష్మీ విజయం సాధించారు.
దీంతో ఈసారి ఎలాగైనా రంపచోడవరంలో గెలిచి తీరాలనే లక్ష్యంతో సాధారణ మహిళను అభ్యర్ధిగా ఎంపిక చేసినట్టు టీడీపీ చెబుతోంది.ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుడైన అనంతబాబు అరాచకాలకు అడ్డుకట్ట వేసి స్థానికుల స్వేచ్ఛ కోసం పోరాడతానని మిరియాల శిరీషాదేవి ప్రకటించింది. అంగన్‌వాడీలకు జీతాలు పెంచకుండా వైసీపీ వేధిస్తే, అంగన్‌వాడీ మహిళకు టీడీపీ టిక్కెట్ ఇచ్చిందని చెప్పారు.
సంబంధిత కథనం