EC Orders on Volunteers : వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు, నగదు పంపిణీ చేయించొద్దని ఆదేశాలు-amaravati election commission orders not to use volunteers for welfare scheme money distribution ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ec Orders On Volunteers : వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు, నగదు పంపిణీ చేయించొద్దని ఆదేశాలు

EC Orders on Volunteers : వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు, నగదు పంపిణీ చేయించొద్దని ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Mar 30, 2024 07:04 PM IST

EC Orders on Volunteers : కేంద్రం ఎన్నికల సంఘం వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది.

వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు
వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు

EC Orders on Volunteers : ఏపీ వాలంటీర్లపై(Volunteers) ఎన్నికల సంఘం(EC) ఆంక్షలు విధించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు(Welfare Schemes) వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్(Election Code) ముగిసే వరకు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ (Pensions Distribution)వాలంటీర్లతో చేయించొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. వాలంటీర్లతో నగదు పంపిణీ వద్దని ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల(High Court Orders) మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఈసీ ఆదేశాలు

వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించాలని ఈసీ... ఏపీ సీఈవోకి ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల విధులపై అభ్యంతరం తెలుపుతూ సిటిజన్ ఫర్ డెమోక్రసీ హైకోర్టులో ఫిబ్రవరిలో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ కేసులో మార్చి 13న హైకోర్టు ఈసీకి పలు కీలక ఆదేశాలు(EC orders) ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఈసీ తాజాగా వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించింది. వాలంటీర్లపై(Volunteers) తరచూ వస్తున్న ఫిర్యాదులు, న్యూ పేపర్లలో వస్తున్న రిపోర్టులు, క్షేత్ర స్థాయిలో వాలంటీర్లు ఓటర్లపై(Volunteers) ప్రభావం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఎన్నికలు ముగిసే వరకూ వాలంటీర్లను సంక్షేమ పథకాల నగదు పంపిణీకి దూరం పెట్టాలని ఈసీ ఆదేశించింది. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఇప్పటికే ఈసీ ఆదేశించింది. అయితే కొందరు వాలంటీర్లు ప్రచారాల్లో పాల్గొంటున్నారు. వీరిపై వస్తున్న ఫిర్యాదులతో ఈసీ సీరియస్ అయ్యింది. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్లపై చర్యలు తీసుకుంటుంది.

1. పింఛన్లతో పాటు నగదు పంపిణీ చేసే ప్రభుత్వ పథకాల నుంచి వాలంటీర్లను దూరం పెట్టాలి.

2.వాలంటీర్లు ఉపయోగించే మొబైల్, టాబ్లెట్, ఇతర పరికరాలను ఎన్నికల కోడ్ ముగిసే వరకూ జిల్లా ఎన్నికల అధికారి వద్ద డిపాజిట్ చేయాలి.

3. ప్రభుత్వ పథకాల నగదు పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు లేదా డీబీటీ (DBT)విధానాన్ని అమలు చేయాలి.

వాలంటీర్ల, సచివాలయ ఉద్యోగులు ఎన్నికల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధులు అప్పగించవద్దని పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఇంకు పూసే పని మాత్రమే అప్పగించాలని ఈసీ ఆదేశించింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లు కూడా అనుమతించవద్దని ఏపీ సీఈవో తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం