CEO Mukesh Kumar Meena : ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ- 48 గంటల ముందు అప్లై చేసుకోవాలి : సీఈవో ముఖేష్ కుమార్ మీనా-amaravati ap ceo mukesh kumar meena says political parties campaign apply on suvidha portal ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ceo Mukesh Kumar Meena : ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ- 48 గంటల ముందు అప్లై చేసుకోవాలి : సీఈవో ముఖేష్ కుమార్ మీనా

CEO Mukesh Kumar Meena : ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ- 48 గంటల ముందు అప్లై చేసుకోవాలి : సీఈవో ముఖేష్ కుమార్ మీనా

Bandaru Satyaprasad HT Telugu
Mar 26, 2024 11:11 PM IST

CEO Mukesh Kumar Meena : ఏపీలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సీఈవో ముఖేష్ కుమార్ మీనా సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీ ప్రచారాలు, సభలు, ర్యాలీలకు సువిధ యాప్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సీఈవో ముఖేష్ కుమార్ మీనా
సీఈవో ముఖేష్ కుమార్ మీనా

CEO Mukesh Kumar Meena : ఏపీలో రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని సీఈవో ముఖేష్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) తెలిపారు. మంగళవారం ఆయన వివిధ రాజకీయ పార్టీల(Politcal Parties) ప్రతినిధులతో సచివాలయంలోని ఈసీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారం(House to House Campaign), కరపత్రాల పంపిణీ, ఊరేగింపులు, ర్యాలీలు, సభ(Political meetings) నిర్వహణకు సువిధ యాప్ లేదా వెబ్ సైట్ suvidha.eci.gov.in అప్లై చేసుకోవాలని సీఈవో సూచించారు. అయితే ర్యాలీలు, సభలు, ప్రచారాలకు 48 గంటల ముందుగా సువిధ యాప్(Suvidha App), వెబ్ సైట్ లో రిటర్నింగ్ అధికారికి అప్లై చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన 24 గంటల్లో ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన అన్ని అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. సువిధ యాప్ ను ప్రచారాలు, ఆన్ లైన్ నామినేషన్లు, అఫిడవిట్ దాఖలు, ర్యాలీలు, సభలు, సమావేశాల కార్యకలాపాల కోసమే రూపొందించామని చెప్పారు. దీంతో పాటు ఎన్నికల కోడ్ అనుసరిస్తూ రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు అనుసరించాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పించారు.

పాడా ఓఎస్డీపై ఈసీ విచారణ

కడప జిల్లా పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (PADA) ఓఎస్‌డీ అనిల్‌కుమార్‌ రెడ్డిపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి మార్చి 23న ఓఎస్‌డీపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్‌(Election Code) రావడానికి ముందు వరకూ పాడా ఓఎస్‌డీ ఆఫీస్, వైసీపీ కార్యాలయం రెండూ ఒకే భవనంలో ఉన్నాయని తన ఫిర్యాదులో తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కోడ్‌ ఓఎస్డీ కార్యాలయాన్ని మినీ సెక్రటేరియట్‌లోకి మార్చారని తెలిపారు. ప్రస్తుతం ఒకే బిల్డింగ్ లో ఆర్వో, ఆర్డీవో, పాడా కార్యాలయాలు ఉన్నాయని ఈసీకి తెలిపారు. పాడా ఓఎస్‌డీ అనిల్‌కుమార్‌ రెడ్డి వైసీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికలు అయ్యే వరకు ఆయనను పులివెందుల నుంచి బదిలీ చేయాలని బీటెక్ రవి(Btech Ravi) కోరారు. ఈ ఫిర్యాదుపై ఈసీ విచారణకు ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో ఓఎస్డీ తన వైర్‌లెస్‌ సెట్‌ను ఆర్డీవోకు అప్పగించారు. అదే విధంగా కడప స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ అశోక్‌ రెడ్డిపైనా కూడా బీటెక్‌ రవి ఈసీకి ఫిర్యాదు చేశారు.

సంబంధిత కథనం