Shami to Hasan Raza: సిగ్గుండాలి.. పిచ్చి మాటలు మాట్లాడకు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌పై షమి సీరియస్
Shami to Hasan Raza: సిగ్గుండాలి.. పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజాపై షమి సీరియస్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా రజా ఈ మధ్య చేసిన కామెంట్స్ పై మండిపడ్డాడు.
Shami to Hasan Raza: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజాపై తీవ్రంగా మండిపడ్డాడు టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి. సిగ్గుండాలి అలా మాట్లాడటానికి అని అన్నాడు. వరల్డ్ కప్ 2023లో టీమిండియా బౌలర్లు చెలరేగుతుండటంపై ఈ మధ్యే రజా వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ బౌలర్లకు వేరే బాల్స్ ఇస్తున్నారని, వాటిని చెక్ చేయాలని అతడు అన్నాడు.
"కాస్త సిగ్గుపడు. గేమ్ మీద ఫోకస్ చేయాలా లేక నీ ఫాల్తూ చెత్త మాటలపైనా. అప్పుడప్పుడైనా ఇతరుల సక్సెస్ ను ఎంజాయ్ చేయడం నేర్చుకో. ఛీ ఛీ. ఇది వరల్డ్ కప్ మీ లోకల్ టోర్నమెంట్ కాదు. నువ్వు కూడా ఓ ప్లేయర్ వే కదా. వసీం భాయ్ ఇప్పటికే చెప్పాడు. మంచిగా వివరించాడు కూడా. అయినా ఇలా. హహహహ. మీ ప్లేయర్ మీ వసీం అక్రమ్ మీద కూడా నమ్మకం లేదా. నిన్ను నువ్వు పొగుడుకునే పనిలో ఉన్నావ్" అని షమి తీవ్రంగా స్పందించాడు.
శ్రీలంకను కేవలం 55 పరుగులకే ఇండియా కుప్పకూల్చిన తర్వాత ఓ పాకిస్థాన్ ఛానెల్ తో మాట్లాడుతూ.. రజా వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఇండియన్ బౌలర్లకు వేరే బాల్స్ ఇస్తున్నారని, వాటిని చెక్ చేయాలని అన్నాడు. ఈ కామెంట్స్ ను పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, షోయబ్ మాలిక్ లాంటి వాళ్లే తప్పుబట్టారు. మీ పరువుతోపాటు మా పరువు కూడా ఎందుకు తీస్తున్నావ్.. ఇండియన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించు అని రజాకు క్లాస్ పీకారు.
ఇదే విషయాన్ని షమి తన ఇన్‌స్టా స్టోరీలో గుర్తు చేస్తూ రజాపై మండిపడ్డాడు. ఇంత జరిగిన తర్వాత కూడా సౌతాఫ్రికాతో మ్యాచ్ తర్వాత ఇండియన్ టీమ్ డీఆర్ఎస్ ను తారుమారు చేస్తోందని రజా మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశాడు.