Mayank Yadav: ఇప్పుడే మొదలు పెట్టా.. నా టార్గెట్ అదే: ప్రత్యర్థులకు ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ వార్నింగ్-mayank yadav fastest ball not even in top 8 of fastest balls in international cricket fast bowler aims to play for india ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mayank Yadav: ఇప్పుడే మొదలు పెట్టా.. నా టార్గెట్ అదే: ప్రత్యర్థులకు ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ వార్నింగ్

Mayank Yadav: ఇప్పుడే మొదలు పెట్టా.. నా టార్గెట్ అదే: ప్రత్యర్థులకు ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ వార్నింగ్

Hari Prasad S HT Telugu
Apr 03, 2024 01:09 PM IST

Mayank Yadav: ఐపీఎల్లో అదరగొడుతున్న ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఇండియాకు ఆడటమే తన లక్ష్యమని చెప్పాడు. వరుసగా రెండు మ్యాచ్ లలో అతడే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇప్పుడే మొదలు పెట్టా.. నా టార్గెట్ అదే: ప్రత్యర్థులకు ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ వార్నింగ్
ఇప్పుడే మొదలు పెట్టా.. నా టార్గెట్ అదే: ప్రత్యర్థులకు ఫాస్టెస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ వార్నింగ్ (AFP)

Mayank Yadav: ఐపీఎల్ 2024లో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్న బౌలర్ మయాంక్ యాదవ్. తన స్పీడుతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ వరుసగా రెండు మ్యాచ్ లలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఈ పేస్ బౌలర్.. ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన బాల్ వేశాడు. ఆర్సీబీని ఓడించిన తర్వాత అతడు మాట్లాడుతూ ఇండియాకు ఆడటమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు.

మయాంక్ యాదవ్ స్పీడు

ఆర్సీబీతో మ్యాచ్ లో 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు మయాంక్ యాదవ్. ఈ మ్యాచ్ లో అతడు ఏకంగా 156.7 కి.మీ. వేగంతో ఓ బాల్ వేశాడు. ఈ సీజన్లో అతనికి అత్యంత వేగవంతమైన బాల్ ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకూ అతడు ఐపీఎల్ 2024లో 48 బాల్స్ వేయగా.. అందులో సగానికిపైనే గంటకు 150 కి.మీ. వేగంతో ఉన్నాయంటే అతని సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఎంతో మంది మాజీ క్రికెటర్లు అప్పుడే అతన్ని ఇండియన్ టీమ్ లోకి తీసుకోవాలని, రాబోయే టీ20 వరల్డ్ కప్ కు, ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. వరుసగా రెండో మ్యాచ్ లోనూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత మయాంక్ మాట్లాడాడు. తన లక్ష్యం ఇండియాకు ఆడటమే అని స్పష్టం చేశాడు.

"నా లక్ష్యం దేశం కోసం ఆడటమే. చాలా ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించాలని అనుకుంటున్నాను. ఇప్పుడే మొదలు పెట్టాను. ఆ ప్రధాన లక్ష్యంపైనే ఎక్కువగా దృష్టి సారించాను. రెండు మ్యాచ్ లలో రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లు చాలా సంతోషంగా ఉంది. రెండు మ్యాచ్ లలోనూ గెలిచాం" అని అన్నాడు. వేగంగా బౌలింగ్ చేయాలంటే ఏం చేయాలో కూడా అతడు చెప్పడం విశేషం.

"వేగంగా బౌలింగ్ చేయడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. తీసుకునే ఆహారం, నిద్ర, ట్రైనింగ్ లాంటివి. వేగంగా బౌలింగ్ చేయాలంటే ఈ విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలి. నా డైట్, రికవరీపై ఎక్కువగా దృష్టిసారిస్తాను. ఐస్ బాత్ నా రికవరీకి బాగా సాయపడుతోంది" అని మయాంక్ చెప్పాడు.

మయాంక్ ఫాస్టెస్ట్ బాల్

ఈ సీజన్లో మయాంక్ తన ఫాస్టెస్ట్ బాల్ వేశాడు కానీ.. ఇది అంతర్జాతీయ క్రికెట్ లో టాప్ 8లో కూడా లేదు. ఆర్సీబీతో మ్యాచ్ లో అతడు గంటకు 156.7 కి.మీ. వేగంతో ఓ బాల్ వేశాడు. అయితే ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ బాల్ వేసిన రికార్డు షాన్ టైట్ (గంటకు 157.71 కి.మీ.) పేరిట ఉంది. రెండో స్థానంలో గెరాల్డ్ కొట్జియా ఈ సీజన్లో 157.4 కి.మీ. వేగంతో వేసినట్లు చెబుతున్నా.. దీనిపై రికార్డు లేదు.

ఇక లాకీ ఫెర్గూసన్ 2022 ఐపీఎల్లో గంటకు 157.3 కి.మీ., అదే ఏడాది ఉమ్రాన్ మాలిక్ గంటకు 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశారు. ఆ తర్వాత ఆరోస్థానంలో మయాంక్ యాదవ్ వేసిన ఈ 156.7 కి.మీ. బాల్ ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో అయితే టాప్ 10లోనూ అతనికి చోటు దక్కలేదు. క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ బాల్ వేసిన రికార్డు పాకిస్థాన్ కు చెందిన షోయబ్ అక్తర్ పేరిట ఉంది.

అతడు 2003 వరల్డ్ కప్ లో గంటకు ఏకంగా 161.3 కి.మీ. వేగంతో బాల్ వేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ నిక్ నైట్ ఆ బంతి ఎదుర్కొన్నాడు. అక్తర్ తర్వాత షాన్ టైట్, బ్రెట్ లీ, జెఫ్ థాంప్సన్, మిచెల్ లాంటి బౌలర్లు అందరూ అంతర్జాతీయ క్రికెట్ లో గంటకు 160 కి.మీ. వేగం అందుకున్నారు.

Whats_app_banner