IPL Matches reschedule: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. ఆ రెండు మ్యాచ్‌ల తేదీలు మారాయి.. నాలుగు జట్లపై ప్రభావం-ipl 2024 matches rescheduled dates of two matches changed kkr rr gt dc teams affected ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Ipl 2024 Matches Rescheduled Dates Of Two Matches Changed Kkr Rr Gt Dc Teams Affected

IPL Matches reschedule: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. ఆ రెండు మ్యాచ్‌ల తేదీలు మారాయి.. నాలుగు జట్లపై ప్రభావం

Hari Prasad S HT Telugu
Apr 02, 2024 03:53 PM IST

IPL Matches reschedule: ఐపీఎల్ 2024 షెడ్యూల్లో మార్పులు జరిగాయి. రెండు మ్యాచ్ ల తేదీలను బీసీసీఐ మార్చింది. దీంతో ఈ ప్రభావం నాలుగు ఫ్రాంఛైజీలపై పడనుంది.

ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. ఆ రెండు మ్యాచ్‌ల తేదీలు మారాయి
ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. ఆ రెండు మ్యాచ్‌ల తేదీలు మారాయి (BCCI)

IPL Matches reschedule: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో రెండు మ్యాచ్ ల షెడ్యూల్లో మార్పులు చేశారు. దీని కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల షెడ్యూల్ మారనుంది. నైట్ రైడర్స్, రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ను ఒక రోజు ముందుకి.. టైటన్స్, క్యాపిటల్స్ మ్యాచ్ ను ఒక రోజు వెనక్కి జరిపారు.

ట్రెండింగ్ వార్తలు

ఆ రెండు మ్యాచ్‌ల షెడ్యూల్లో మార్పు

ఐపీఎల్ 2024లో భాగంగా రెండు మ్యాచ్ ల షెడ్యూల్ ను మార్చినట్లు మంగళవారం (ఏప్రిల్ 2) ఓ ప్రకటన ద్వారా బీసీసీఐ వెల్లడించింది. నిజానికి కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ పాత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీరామ నవమి కారణంగా మ్యాచ్ కు తగినంత భద్రత ఏర్పాటు చేయలేమని స్థానిక పోలీసులు చేతులెత్తేశారు.

దీంతో కేకేఆర్, ఆర్ఆర్ మ్యాచ్ ను ఒక రోజు ముందుగానే అంటే ఏప్రిల్ 16నే నిర్వహించనున్నారు. దీని కారణంగా ఏప్రిల్ 16న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను ఏప్రిల్ 17కు మార్చారు. ఈ తేదీల మార్పుతో ఈ రెండు మ్యాచ్ లకు సెక్యూరిటీ ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించే వీలు కలుగుతుందని బీసీసీఐ చెప్పింది.

ఐపీఎల్ షెడ్యూల్ ఇదీ

ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ 17వ సీజన్ మే 26 వరకు జరగనుంది. ఆ రోజున చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఫైనల్ జరగనుంది. మే 19తో లీగ్ స్టేజ్ ముగుస్తుంది. మే 21, 22, 24 తేదీల్లో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్ లు జరుగుతాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లు అహ్మదాబాద్ లో జరుగుతాయి.

ఇక క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్ లు చెన్నైలో జరుగుతాయి. పదేళ్ల తర్వాత చెన్నైలోని చిదంబరం స్టేడియం ఐపీఎల్ ఫైనల్ కు ఆతిథ్యమివ్వబోతోంది. గతేడాది ఫైనల్ కు నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్ ను రెండు విడతలుగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు మొదట అనౌన్స్ చేయగా.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజైన తర్వాత మిగతా మ్యాచ్ ల షెడ్యూల్ వెల్లడించారు.

ఇక ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ ల సంగతి చూస్తే.. రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల టేబుల్లో టాప్ లో ఉంది. ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ ఓటములతో చివరన ఉంది. 181 పరుగులు చేసిన రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్ దగ్గర ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ 7 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

IPL_Entry_Point