తెలుగు న్యూస్ / ఫోటో /
IPL 2024 Points Table: చివరి స్థానం కోసం పోటీ పడుతున్న ఆర్సీబీ, ముంబై ఇండియన్స్.. టాప్ 4 టీమ్స్ ఇవే
- IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ చివరి స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. టాప్ 4 టీమ్స్ ఏవో చూడండి.
- IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ చివరి స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. టాప్ 4 టీమ్స్ ఏవో చూడండి.
(1 / 10)
IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ టాప్ లోనే కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో ఆ టీమ్ 6 పాయింట్లు, 1.249 నెట్ రన్ రేట్ తో తొలి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఓటమెరగని టీమ్ ఇదొక్కటే.
(2 / 10)
IPL 2024 Points Table: కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఆడిన రెండు మ్యాచ్ లలోనూ విజయాలు సాధించింది. ఆ టీమ్ 4 పాయింట్లు, 1.047 నెట్ రన్ రేట్ తో రెండో స్థానంలో ఉంది.
(3 / 10)
IPL 2024 Points Table: డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ 3 మ్యాచ్ లలో 2 గెలిచి, ఒకటి ఓడింది. 4. పాయింట్లు, 0.976 నెట్ రన్ రేట్ తో మూడోస్థానంలో ఉంది రుతురాజ్ సేన.
(4 / 10)
IPL 2024 Points Table: తాజాగా ఆర్సీబీని 28 పరుగులతో చిత్తు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. ఆ టీమ్ మూడు మ్యాచ్ లలో రెండు గెలిచి, ఒకటి ఓడింది. 4 పాయింట్లు, 0.483 నెట్ రన్ రేట్ తో ఉంది.
(5 / 10)
IPL 2024 Points Table: గుజరాత్ టైటన్స్ కూడా మూడు మ్యాచ్ లలో 2 గెలిచి, ఒకటి ఓడినా.. ఆ టీమ్ నెట్ రన్ రేట్ మైనస్ లో ఉన్న కారణంగా ఐదోస్థానంలో ఉంది. జీటీ టీమ్ 4 పాయింట్లు, -0.738 నెట్ రన్ రేట్ తో ఉంది.
(6 / 10)
IPL 2024 Points Table: ముంబై ఇండియన్స్ పై ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులతో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ మ్యాచ్ తప్ప మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ ఓడింది. దీంతో మొత్తంగా 3 మ్యాచ్ లలో ఒకటి గెలిచి, రెండు ఓడి 2 పాయింట్లు, 0.204 నెట్ రన్ రేట్ తో ఆరోస్థానంలో ఉంది.
(7 / 10)
IPL 2024 Points Table: రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 3 మ్యాచ్ లలో ఒకటి గెలిచి, రెండు ఓడి 2 పాయింట్లు, -0.016 నెట్ రన్ రేట్ తో ఏడోస్థానంలో కొనసాగుతోంది.
(8 / 10)
IPL 2024 Points Table: పంజాబ్ కింగ్స్ కూడా ఆడిన మూడు మ్యాచ్ లలో ఒకటి గెలిచి, రెండు ఓడింది. ఆ టీమ్ ఖాతాలో ప్రస్తుతం 2 పాయింట్లు, -0.337 నెట్ రన్ రేట్ తో 8వ స్థానంలో ఉంది.
(9 / 10)
IPL 2024 Points Table: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు ఓడింది. సొంత మైదానంలో లక్నో చేతుల్లో మరో ఓటమితో ఆ టీమ్ 2 పాయింట్లు, -0.876 నెట్ రన్ రేట్ తో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.
ఇతర గ్యాలరీలు