India vs Bangladesh Live Streaming: రేపే ఇండియా, బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ప్రారంభం.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే?-india vs bangladesh live streaming details watch first test on jio cinema ott sports 18 channel ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Bangladesh Live Streaming: రేపే ఇండియా, బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ప్రారంభం.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే?

India vs Bangladesh Live Streaming: రేపే ఇండియా, బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ప్రారంభం.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Sep 18, 2024 12:34 PM IST

India vs Bangladesh Live Streaming: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు గురువారం (సెప్టెంబర్ 19) ప్రారంభం కాబోతోంది. మరి ఈ టెస్ట్ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి అనే వివరాలు ఇక్కడ చూడండి.

రేపే ఇండియా, బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ప్రారంభం.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే?
రేపే ఇండియా, బంగ్లాదేశ్ తొలి టెస్ట్ ప్రారంభం.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే? (PTI)

India vs Bangladesh Live Streaming: టీమిండియా స్వదేశంలో మరో టెస్ట్ సిరీస్ కు సిద్ధమైంది. ఈసారి బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. సుమారు నెలన్నర గ్యాప్ తర్వాత మన టీమ్ మళ్లీ ఫీల్డ్ లోకి అడుగు పెట్టబోతోంది. బంగ్లాదేశ్ తో తొలి టెస్టు గురువారం (సెప్టెంబర్ 19) చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ప్రారంభం కానుంది.

ఇండియా, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్

టీమిండియా చివరిసారి మార్చిలో ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ఆడింది. ఐదు టెస్టుల ఆ సిరీస్ ను 4-1తో గెలుచుకుంది. ఇప్పుడు ఆరు నెలల తర్వాత మళ్లీ ఐదు రోజుల క్రికెట్ ఆడనుంది. ఇందులో భాగంగా స్వదేశంలో మొదట బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు, తర్వాత న్యూజిలాండ్ తో మూడు టెస్టులు, ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో ఐదు టెస్టులు ఆడుతుంది.

బంగ్లాతో తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు చెన్నైలో జరుగుతుంది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లో జరగనుంది. పాకిస్థాన్ ను వాళ్ల స్వదేశంలో 2-0తో చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో ఇండియాకు వచ్చింది బంగ్లాదేశ్ టీమ్.

ఇండియా, బంగ్లాదేశ్ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్

ఇండియా, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను స్పోర్ట్స్ 18, జియో సినిమా ఓటీటీ సొంతం చేసుకున్నాయి. టీవీలో అయితే స్పోర్ట్స్ 18, కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్స్ లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు.

ఇక ఆన్‌లైన్లో అయితే జియో సినిమాలో ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. గురువారం (సెప్టెంబర్ 19) ఉదయం 9.30 గంటలకు తొలి టెస్టు ప్రారంభం కానుంది. 2024-25 ఇండియా హోమ్ సీజన్ చెన్నైలో ప్రారంభం కానుంది.

బంగ్లాదేశ్‌తో సిరీస్ కు టీమిండియా

తొలి టెస్టు కోసం 16 మందితో జట్టుని బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. టీమ్‌లోకి రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్ ఎంపికయ్యారు.

బంగ్లాదేశ్ టీమ్ ఇదే

అటు భారత్‌తో రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 16 మందితో కూడిన జట్టుని ప్రకటించింది. టీమ్‌లో నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్లా హసన్ జాయ్, జాకీర్ హసన్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ అనిక్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, షాద్మన్ ఇస్లాం, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, నయీమ్ హసన్, నహీద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్ ఎంపికయ్యారు.