IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలివే-india vs bangladesh test series full schedule squads ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ind Vs Ban: భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలివే

IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలివే

Sep 17, 2024, 07:54 PM IST Galeti Rajendra
Sep 17, 2024, 07:54 PM , IST

India vs Bangladesh Schedule: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఆసక్తికరమైన టెస్టు సిరీస్‌ ఈ నెల 19 నుంచి ప్రారంభంకానుంది. పాకిస్థాన్ జట్టుని దాని సొంతగడ్డపైనే ఓడించిన బంగ్లాదేశ్ టీమ్.. అదే జోరుని భారత్ గడ్డపై కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం మొత్తం 16 మందితో కూడిన భారత్ జట్టుని సెలెక్టర్లు ఎంపిక చేశారు. దులీప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌ల ఆధారంగా కొంత మంది జట్టులోకి ఎంపికవగా.. మరికొందరు సీనియర్లు టీమ్‌లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం భారత్ జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. 

(1 / 6)

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం మొత్తం 16 మందితో కూడిన భారత్ జట్టుని సెలెక్టర్లు ఎంపిక చేశారు. దులీప్ ట్రోఫీ ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌ల ఆధారంగా కొంత మంది జట్టులోకి ఎంపికవగా.. మరికొందరు సీనియర్లు టీమ్‌లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం భారత్ జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. (REUTERS)

భారత హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్‌‌‌కి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ రూపంలో కఠిన సవాల్ ఎదురుకాబోతోంది. పాక్ టీమ్‌కి దాని సొంతగడ్డపైనే చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ టీమ్.. భారత్‌‌కి కూడా షాకిచ్చే అవకాశాలు లేకపోలేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. దాంతో గంభీర్ వ్యూహాలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

(2 / 6)

భారత హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్‌‌‌కి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ రూపంలో కఠిన సవాల్ ఎదురుకాబోతోంది. పాక్ టీమ్‌కి దాని సొంతగడ్డపైనే చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ టీమ్.. భారత్‌‌కి కూడా షాకిచ్చే అవకాశాలు లేకపోలేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. దాంతో గంభీర్ వ్యూహాలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. (PTI)

2022 చివర్లో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్టు టీమ్‌లోకి ఎంపికయ్యాడు. టీమ్‌లోనే అతనికి పోటీగా యంగ్ వికెట్ కీపర్ జురైల్ కూడా ఉండటంతో రిషబ్ పంత్‌‌‌పై ఒత్తిడి కనిపిస్తోంది. ఒకవేళ ఈ సిరీస్‌లో విఫలమైతే.. విమర్శలతో పాటు జట్టులో స్థానాన్ని కూడా పంత్ కోల్పోవాల్సి వస్తుంది. 

(3 / 6)

2022 చివర్లో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్టు టీమ్‌లోకి ఎంపికయ్యాడు. టీమ్‌లోనే అతనికి పోటీగా యంగ్ వికెట్ కీపర్ జురైల్ కూడా ఉండటంతో రిషబ్ పంత్‌‌‌పై ఒత్తిడి కనిపిస్తోంది. ఒకవేళ ఈ సిరీస్‌లో విఫలమైతే.. విమర్శలతో పాటు జట్టులో స్థానాన్ని కూడా పంత్ కోల్పోవాల్సి వస్తుంది. 

తొలి టెస్టు కోసం 16 మందితో జట్టుని బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. టీమ్‌లోకిరోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాళ్ ఎంపికయ్యారు. 

(4 / 6)

తొలి టెస్టు కోసం 16 మందితో జట్టుని బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. టీమ్‌లోకిరోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాళ్ ఎంపికయ్యారు. (PTI)

భారత్‌తో రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 16 మందితో కూడిన జట్టుని ప్రకటించింది. టీమ్‌లో నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్లా హసన్ జాయ్, జాకీర్ హసన్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ అనిక్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, షాద్మన్ ఇస్లాం, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, నయీమ్ హసన్, నహీద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్ ఎంపికయ్యారు.

(5 / 6)

భారత్‌తో రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 16 మందితో కూడిన జట్టుని ప్రకటించింది. టీమ్‌లో నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్లా హసన్ జాయ్, జాకీర్ హసన్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), జాకర్ అలీ అనిక్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, షాద్మన్ ఇస్లాం, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, నయీమ్ హసన్, నహీద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్ ఎంపికయ్యారు.(AFP)

ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టుకి చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత ఈ నెల 27 నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ రెండు టెస్టు మ్యాచ్‌లు ఉదయం 9.30 గంటలకి ప్రారంభంకానున్నాయి. 

(6 / 6)

ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టుకి చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత ఈ నెల 27 నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ రెండు టెస్టు మ్యాచ్‌లు ఉదయం 9.30 గంటలకి ప్రారంభంకానున్నాయి. (PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు