Virat Kohli: వ‌న్డేల్లో శ్రీలంక‌పైనే కోహ్లి హ‌య్యెస్ట్ సెంచ‌రీలు - వాంఖ‌డేలో మ‌రో సెంచ‌రీ ఖాయ‌మేనా?-ind vs sl world cup 2023 virat kohli odi centuries record against sri lanka ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: వ‌న్డేల్లో శ్రీలంక‌పైనే కోహ్లి హ‌య్యెస్ట్ సెంచ‌రీలు - వాంఖ‌డేలో మ‌రో సెంచ‌రీ ఖాయ‌మేనా?

Virat Kohli: వ‌న్డేల్లో శ్రీలంక‌పైనే కోహ్లి హ‌య్యెస్ట్ సెంచ‌రీలు - వాంఖ‌డేలో మ‌రో సెంచ‌రీ ఖాయ‌మేనా?

Nelki Naresh Kumar HT Telugu
Nov 01, 2023 01:41 PM IST

Virat Kohli: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా గురువారం శ్రీలంక‌తో జ‌రుగుతోన్న మ్యాచ్‌లో కోహ్లి సెంచ‌రీ చేసి తీరుతాడ‌ని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తోన్నారు. వ‌న్డేల్లో శ్రీలంక‌పైనే కోహ్లి అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన నేప‌థ్యంలో అభిమానుల ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

Virat Kohli: విరాట్ కోహ్లి 49వ సెంచ‌రీ క‌ల ఇంగ్లండ్‌పై తీరుతుంద‌ని అభిమానులు ఆశ‌ప‌డ్డారు. కానీ ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లి డ‌కౌట్ అయ్యి నిరాశ‌ప‌రిచాడు. ఆ మ్యాచ్‌లో చేజారిన క‌ల శ్రీలంక‌పై త‌ప్ప‌కుండా తీరుతుంద‌ని కోహ్లి అభిమానులు చెబుతోన్నారు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా న‌వంబ‌ర్ 2న (గురువారం) శ్రీలంక‌తో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది.

ముంబాయి వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌రుగ‌నుంది. శ్రీలంక‌పై కోహ్లి త‌ప్ప‌కుండా సెంచ‌రీ చేస్తాడ‌ని అత‌డి అభిమానులు సోష‌ల్ మీడియా ట్వీట్స్ చేస్తున్నారు. కోహ్లి వ‌న్డేల్లో ఇప్ప‌టివ‌ర‌కు 48 సెంచ‌రీలు చేశాడు. అందులో అత్య‌ధికంగా ప‌ది సెంచ‌రీలు శ్రీలంక‌పైనే చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో అభిమానుల ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

ఒక‌వేళ అభిమానులు కోరుకున్న‌ట్లుగా కోహ్లి శ్రీలంక‌పై సెంచ‌రీ సాధిస్తే వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్‌గా స‌చిన్ రికార్డ్‌ను స‌మం చేసే అవ‌కాశం ఉంది. ఈ లిస్ట్‌లో 49 సెంచ‌రీల‌తో స‌చిన్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌గా...కోహ్లి 48 సెంచ‌రీల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతోన్నాడు. 2023 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కోహ్లి ఆరు మ్యాచుల్లో ఓ సెంచ‌రీ, మూడు హాఫ్ సెంచ‌రీల‌తో 354 ప‌రుగులు చేశాడు.

టీమిండియా త‌ర‌ఫున ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో హ‌య్యెస్ట్ స్కోర‌ర్‌గా కోహ్లి నిలిచాడు. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ క‌ప్ పాయింట్స్ టేబుల్‌లో ఆరు మ్యాచుల్లో ఆరు విజ‌యాల‌తో టీమిండియా టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోంది. మ‌రోవైపు ఆరు మ్యాచుల్లో రెండు విజ‌యాల‌తో శ్రీలంక ఏడో స్థానంలో నిలిచింది. టీమిండియాపై శ్రీలంక ఓడిపోతే ఆ జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్‌ను నుంచి అఫీషియ‌ల్‌గా నిష్క్ర‌మిస్తుంది.