India vs South Africa 1st Test: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. టీమిండియా యువ పేసర్ టెస్టు అరంగేట్రం.. జడేజా మిస్
India vs South Africa 1st Test: దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు షురూ అయింది. టాస్ గెలిచింది సఫారీ జట్టు. భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ. వివరాలివే..
India vs South Africa 1st Test: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు పోరు షురూ అయింది. రెండు టెస్టుల సిరీస్‍లో నేడు (డిసెంబర్ 26) సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం అయింది. వర్షం పడి మైదానం చిత్తడిగా మారటంతో టాస్ కాస్త ఆలస్యంగా పడింది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో పేస్‍కు అనుకూలించే పిచ్‍పై భారత్ ముందుగా బ్యాటింగ్‍కు దిగనుంది. వెన్ను ఇబ్బంది కారణంగా ఈ మ్యాచ్‍కు రవీంద్ర జడేజా దూరమయ్యాడని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. వివరాలివే..
ప్రసిద్ధ్ అరంగేట్రం
ఈ మ్యాచ్ ద్వారా భారత్ యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ టెస్టు క్రికెట్‍లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో రాణిస్తున్న అతడు.. ఇప్పుడు భారత టెస్టు జట్టులోనూ అడుగుపెట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణకు టెస్ట్ క్యాప్ అందించాడు స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా.
జడేజా మిస్.. అశ్విన్‍కు ప్లేస్
వెన్ను సమస్య కారణంగా భారత స్టార్ ఆల్‍రౌండర్ రవీంద్ర జడేజా ఈ తొలి టెస్టుకు దూరమయ్యాడు. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‍కు తుది జట్టులో చోటు దక్కింది.
పిచ్‍పై పచ్చిక, మేఘావృతమైన వాతావరణం వల్ల తొలుత బ్యాటింగ్‍కు పరిస్థితులు కష్టంగా ఉంటాయని, అయితే ఈ ఛాలెంజ్‍కు తాము సిద్ధంగా ఉన్నామని టాస్ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నామని అన్నాడు. పేసర్లు బుమ్రా, షార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్ ఆడుతున్నారు. ఏకైక స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు.
భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
దక్షిణాఫ్రికా తుదిజట్టు: డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్ రమ్, టోనీ డీ జోర్జీ, టెంబా బవుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్‍హామ్, కైల్ వెరైన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోట్జీ, కగిసో రబాడ, నార్డే బర్గర్