India vs South Africa 2nd T20: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. భారత్ జట్టులో రుతురాజ్‍కు దక్కని చోటు.. తుది జట్ల వివరాలివే
India vs South Africa 2nd T20: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మొదలైంది. సౌతాఫ్రికా టాస్ గెలిచింది.
India vs South Africa 2nd T20: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 షురూ అయింది. ఈ మూడు టీ20ల సిరీస్‍లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నేడు (డిసెంబర్ 12) రెండో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‍తోనే దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన షురూ అవుతోంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ రెండో టీ20 కెబెర్హాలోని సెయిట్ జార్జ్ పార్క్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‍కు దిగనుంది భారత జట్టు.
ఇటీవల ఫుల్‍ఫామ్‍లో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‍కు ఈ మ్యాచ్‍లో భారత తుది జట్టులో చోటు దక్కలేదు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్ వైపే టీమిండియా మేనేజ్‍మెంట్ మొగ్గుచూపింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు ప్లేస్ లభించింది. ఇషాన్ కిషన్, రవి బిష్ణోయ్ కూడా తుది జట్టులో అవకాశం దక్కలేదు.
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా ఈ టీ20 సిరీస్‍కు రెస్ట్ తీసుకున్నారు. దీంతో ఈ సిరీస్‍లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్ జరగనుండడంతో సన్నాహకంగా ఈ టీ20 సిరీస్ కూడా భారత్‍కు కీలకంగా ఉంది.
టీ20 ప్రపంచకప్ మరో ఆరు నెలల్లోనే ఉండటంతో ఈ సిరీస్ తమకు కీలకమని టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పాడు. టాస్ ఓడినా తొలుత బ్యాటింగ్ దక్కడం సంతోషమేనని అన్నాడు.
భారత తుదిజట్టు: యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్
దక్షిణాఫ్రికా తుదిజట్టు: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీజ్‍కే, ఐడెన్ మార్క్ రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, ఆండిల్ ఫెలుక్వాయో, గెలార్డ్ కోట్జీ, లిజాడ్ విలియమ్స్, తబ్రైజ్ షంషి
ఈ పర్యటనలో టీ20 సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‍లను టీమిండియా ఆడనుంది.