IND vs SA 3rd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా
IND vs SA 3rd T20: టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య గురువారం (డిసెంబర్ 14) మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే 0-1 పాయింట్‌తో వెనుకబడి ఉన్న భారత్‌కు ఈ మ్యాచ్ కీలకం కానున్న నేపథ్యంలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.
IND vs SA 3rd T20: భారత్, దక్షిణాఫ్రికా మధ్య నిర్ణయాత్మక మ్యాచ్ అంతా సిద్ధమై ప్రారంభమైంది. సౌతాఫ్రికా వేదిక జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‍లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించిన విషయం తెలసిందే. దీంతో గురువారం అంటే నేడు (డిసెంబర్ 14) జరగనున్న మూడో టీ20 సిరీస్‍కు నిర్ణయాత్మకంగా మారింది. ఈ మ్యాచ్ గెలిచి.. సిరీస్‍ను సమం చేసుకోవాలని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ పట్టుదలగా ఉంది.
అయితే, జోహన్నెస్ బర్గ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం దక్షిణ ఆఫ్రికా ఏకంగా మూడు మార్పులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ ప్లేస్‌లో డొనొవన్ ఫెరియెరా జట్టులోకి వచ్చాడు. అలాగే మార్కో జాన్సెన్, గెరాల్డ్ కొయేట్జీ స్థానాల్లో కేశవ్ మహారాజ్, నండ్రే బర్గర్ టీమ్‌లో ఆడుతున్నారు. ఇక టీమిండియా రెండో మ్యాచ్ జట్టునే యధాతథంగా కొనసాగిస్తోంది.
టీమిండియా జట్టు
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
సౌతాఫ్రికా జట్టు
రిజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్నిచ్ క్లాసెన్, డొనొవన్ ఫెరియెరా, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్, నండ్రే బర్గర్, అండిల్ ఫెహ్లుక్వాయో, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్ షంసీ.
ఇక మూడో టీ20 మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లలో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడారు. శుభ్‌మన్ గిల్ 3 ఫోర్స్ కొట్టగా.. జైస్వాల్ 2 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. కానీ, శుభ్‌మన్ గిల్ 12 రన్లకే అవుట్ అయి పెవిలియన్ చేరితే.. తిలక్ వర్మ వచ్చి రాగానే ఔట్ అయ్యాడు. దాంతో సౌతాఫ్రికా బౌలర్ మహారాజ్ 2 వికెట్లు తీశాడు.