IND vs ENG 5th Test Toss: ఐదో టెస్ట్‌లో బుమ్రా రీఎంట్రీ - రికార్డులపై కన్నేసిన టీమిండియా
IND vs ENG 5th Test Toss: ధర్మశాల వేదికగా జరుగుతోన్న ఐదో టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలో దిగింది.
IND vs ENG 5th Test Toss:ఇండియా, ఇంగ్లండ్ మధ్య గురువారం (నేటి) నుంచి నాలుగో టెస్ట్ మొదలైంది. ధర్మశాల వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇప్పటికే 3-1తో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో ఐదో టెస్ట్‌లో బరిలోకి దిగింది. నామమాత్రమైన ఈ టెస్ట్‌లో విజయం సాధించాలని రోహిత్ సేన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చివరి టెస్ట్‌లో టీమిండియా రెండు మార్పులు చేసింది.
రజత్ పాటిదార్ స్థానంలో...
ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమైన రజత్ పాటిదార్ స్థానంలో దేవదత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్‌తోనే టీమిండియా తరఫున టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రజత్ పాటిదార్. కోహ్లి, రాహుల్ వంటి సీనియర్లు అందుబాటులోలేని వేళ తన బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపిస్తాడని టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులు ఆశించారు. కానీ అంచనాలకు అందుకోలేక చతికిలా పడ్డాడు. మూడు టెస్టుల్లో కలిపి కేవలం 63 పరుగులే చేశాడు. అతడి హయ్యెస్ట్ స్కోర్ 32 కావడం గమనార్హం. నాలుగు టెస్ట్‌కు దూరమైన బుమ్రా తిరిగి వచ్చేశాడు.
54 ఏళ్ల రికార్డు...
ఈ సిరీస్‌లో టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. నాలుగు మ్యాచుల్లో 655 రన్స్ చేశాడు. ఇంగ్లండ్‌తో 2016-17లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కోహ్లి 655 పరుగులు చేశాడు. మరో ఒక్క రన్ చేస్తే ఇంగ్లండ్‌పై ఓ టెస్ట్ సిరీస్‌లో హయ్యెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్‌గా యశస్వి జైస్వాల్...కోహ్లి రికార్డును బ్రేక్ చేస్తాడు. ఇండియా తరఫున హయ్యెస్ట్ టెస్ట్ సిరీస్‌లో హయ్యెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్స్‌లో గవాస్కర్ 774 రన్స్‌తో టాప్‌లో ఉన్నాడు. ధర్మశాల టెస్ట్‌తో గవాస్కర్ రికార్డుపై యశస్వి జైస్వాల్ కన్నేశాడు. యాభై నాలుగేళ్ల గవాస్కర్ రికార్డును అతడు అధిగమిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
అశ్విన్ వందో టెస్ట్...
టీమిండియా సీనియర్ స్పిన్సర్ అశ్విన్‌కు ఇది వందో టెస్ట్. వందో టెస్ట్‌లో అతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. అతడితో పాటు ఇంగ్లండ్ కీపర్ బెయిర్‌స్టోకి కి కూడా ఇది వందో టెస్ట్ కావడం గమనార్హం.
సీనియర్లు విఫలం...
ఈ ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ కూడా ఓ మార్పు చేసింది. రాబిన్సన్ ప్లేస్‌లో మార్క్‌వుడ్ జట్టులోకి వచ్చాడు. ఐదో టెస్ట్‌లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. సీనియర్లు బెన్ స్టోక్స్, రూట్, బెయిర్ స్టో అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోవడమే ఇంగ్లండ్ ను ఇబ్బంది పెడుతోంది.
ఒకే ఒక టెస్ట్...
ధర్మశాల స్టేడియం స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు టీమిండియా ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా ఘన విజయం సాధించింది.
ధర్మశాల వేదికగా జరుగుతోన్న ఐదో టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలో దిగింది.
ఇండియా జట్టు ఇదే
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్, అశ్విన్, జడేజా, బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, దేవదత్ పడిక్కల్
ఇంగ్లండ్ జట్టు ఇదే...
డకెట్, క్రాలీ, బెన్ స్టోక్స్, రూట్, బెయిర్ స్టో, అండర్సన్, ఫోక్స్, హర్ట్‌లీ, మార్కవుట్, షోయబ్ బషీర్, ఓలీ పోప్