Ind vs Aus Toss: ఇండియా బౌలింగ్.. టీమ్‌లో అశ్విన్, శ్రేయస్, రుతురాజ్
Ind vs Aus Toss: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్టులోకి అశ్విన్, శ్రేయస్, రుతురాజ్, షమి తిరిగి రావడం విశేషం.
Ind vs Aus Toss: వరల్డ్ కప్ కంటే ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. రాత్రి పూట మంచు ప్రభావం ఉండటంతో రాహుల్ టాస్ గెలవగానే మొదట బౌలింగ్ చేయనున్నట్లు చెప్పాడు.
ఇక ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు తుది జట్టులోకి సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తోపాటు శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమి తిరిగి రావడం విశేషం. "చేజింగ్ కు అనుకూలించే గ్రౌండ్ ఇది. కొన్ని సమస్యలను అధిగమించాల్సి ఉంది. మరింత మెరుగవ్వాలి. ఆస్ట్రేలియా మంచి టీమ్. వాళ్లతో మాకు సవాలే" అని టాస్ సందర్భంగా రాహుల్ అన్నాడు.
అటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా తాము టాస్ గెలిస్తే మొదట బౌలింగే తీసుకునేవాళ్లమని చెప్పడం విశేషం. ఆ టీమ్ కీలకమైన ప్లేయర్స్ స్టార్క్, మ్యాక్స్‌వెల్ లేకుండానే బరిలోకి దిగుతోంది. అయితే స్మిత్, కమిన్స్ పూర్తి ఫిట్‌నెస్ తో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా టీమ్ చాలా బలంగానే కనిపిస్తోంది.
ఇక పిచ్ విషయానికి వస్తే.. చాలా ఫ్లాట్ గా ఉన్నట్లు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన పిచ్ రిపోర్టులో చెప్పాడు. మంచి బ్యాటింగ్ పిచ్ అని, బౌలర్లకు ఇబ్బందులు తప్పవని తెలిపాడు. అయితే మంచు ప్రభావం అంతగా ఉండకపోవచ్చని కూడా అతడు చెప్పడం గమనార్హం.
ఇండియా తుది జట్టు ఇదే
శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, షమి
ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టాయినిస్, మాథ్యూ షార్ట్, ప్యాట్ కమిన్స్, సీన్ అబాట్, అడమ్ జంపా