KL Rahul Athiya Shetty: అంబానీ ఇంట్లో భార్య అతియాతో కేఎల్ రాహుల్.. ఎందుకో తెలుసా?
KL Rahul Athiya Shetty In Mukesh Ambani Home: టీమిండియా క్రికెట్ ప్లేయర్లు అంతా భారత కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట్లో దర్శనం ఇచ్చారు. వారిలో కేఎల్ రాహుల్, తన భార్య అతియా శెట్టి జోడీ కనువిందు చేస్తోంది.
భారత క్రికెట్ అగ్ర ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ నుంచి నెలల తరబడి జట్టుకు దూరమైన ఈ కర్ణాటక ప్లేయర్ ఇటివలీ ఆసియా కప్ 2023లో దుమ్ములేపాడు. ఆసియా కప్‍తో మళ్లీ క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ పూర్తి స్థాయిలో ఫిట్‍నెస్ కారణంగా ఈ టోర్నీలోని తొలి రెండు మ్యాచ్‍లకు దూరమైన విషయం తెలిసిందే. కానీ, దాయాది పాకిస్తాన్‍తో సూపర్-4 మ్యాచ్‍లో శ్రేయస్ స్థానంలో టీమ్‍లోకి వచ్చిన కేఎల్ రాహుల్ అజేయ సెంచరీ (111) చేసి ఆకట్టుకున్నాడు.
బ్యాట్‍తో భారీ పరుగులు చేయడమే కాకుండా వికెట్ కీపింగ్‍తో ఆకట్టుకుని అదరగొట్టాడు. ఫలితంగా వన్డే క్రికెట్ కప్-2023కి అన్ని రకాలుగా రెడీ అన్నట్లుగా చూపించాడు. అంతేకాకుండా, దీనికంటే ముందు భారత్‍లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‍కు ఏకంగా కెప్టెన్‍గా సెలెక్ట్ కూడా అయ్యాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గైర్హాజరు కానున్న నేపథ్యంలో మొదటి రెండు మ్యాచ్‍లకు రాహుల్ కెప్టెన్‍గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ సెప్టెంబర్ 22న మొదలు కానుంది.
ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 22 నుంచి సిరీస్ ప్రారంభం కానుండగా.. దొరికిన కాస్తా సమయాన్ని భార్య అతియా శెట్టితో గడుపుతున్నాడు కేఎల్ రాహుల్. ఇందులో భాగంగానే భారత కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట్లో నిర్వహించే గణపతి పూజలో భార్యతో కలిసి కేఎల్ రాహుల్ పాల్గొన్నాడు. వైట్ కుర్తా, పైజామాతో రాహుల్ ఉంటే.. ఎరుపు రంగు చీరలో అతియా శెట్టి సాంప్రదాయకట్టుతో ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
కేఎల్ రాహుల్-అతియా శెట్టి మాత్రమే కాకుండా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం తన కుటుంబంతో అంబానీ ఇంట్లో సందడి చేశారు. వీరే కాకుండా పలువురు క్రికెటర్లు వినాయకుడు పూజలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయినా అతియా శెట్టిని కేఎల్ రాహుల్ ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఏ ఏడాది జనవరిలో వీరి పెళ్లి జరిగింది.