AB de Villiers: అతడు ప్రపంచకప్ భారత జట్టులో ఉండడం నాకు సంతోషంగా అనిపించింది: డివిలియర్స్-i am big fan of suryakumar yadav says ab de villiers ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ab De Villiers: అతడు ప్రపంచకప్ భారత జట్టులో ఉండడం నాకు సంతోషంగా అనిపించింది: డివిలియర్స్

AB de Villiers: అతడు ప్రపంచకప్ భారత జట్టులో ఉండడం నాకు సంతోషంగా అనిపించింది: డివిలియర్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 09, 2023 03:58 PM IST

AB de Villiers: భారత డ్యాషింగ్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్‍పై ప్రశంసలు కురిపించాడు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్. సంజూ శాంసన్ గురించి కూడా మాట్లాడాడు.

AB de Villiers: అతడు ప్రపంచకప్ భారత జట్టులో ఉండడం నాకు సంతోషంగా అనిపించింది: డివిలియర్స్
AB de Villiers: అతడు ప్రపంచకప్ భారత జట్టులో ఉండడం నాకు సంతోషంగా అనిపించింది: డివిలియర్స్

AB de Villiers: వన్డే ప్రపంచకప్ మెగాటోర్నీ సమీపిస్తోంది. భారత్ వేదికగా అక్టోబర్ 5న వరల్డ్ కప్ మొదలు కానుంది. ఇప్పటికే ఈ ప్రపంచకప్ కోసం భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. అయితే, ఈ ఎంపికపై కొందరు మాజీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్‍ను కాకుండా సూర్యకుమార్ యాదవ్‍ను ప్రపంచకప్‍ కోసం తీసుకోవడంపై కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ తరుణంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ తాజాగా ఈ విషయంపై మాట్లాడాడు. తాను సూర్యకుమార్ యాదవ్‍కు పెద్ద అభిమానినని అన్నాడు.

ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ ఉండడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని తన యూట్యూబ్ ఛానెల్‍లో ఏబీ డివిలియర్స్ చెప్పాడు. “ప్రపంచకప్ జట్టులో SKY (సూర్యకుమార్ యాదవ్) ఉండడాన్ని చూసి నేను ఆనందించా. నేను అతడికి పెద్ద ఫ్యాన్ అని మీకు తెలుసు. నేను టీ20 క్రికెట్ ఎలా ఆడతానో.. అదే తీరుగా అతడు ఆడతాడు. అతడు ఇంకా వన్డే క్రికెట్‍లో అదరగొట్టలేదు. కానీ అతడు తన కాస్త ఆలోచన తీరును మార్చుకోవాల్సి ఉంది.. అంతే” అని డివిలియర్స్ చెప్పాడు. టీ20ల్లో సత్తాచాటిన సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఆ ఫార్మాట్‍లో ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నాడు. టీమిండియా మిస్టర్ 360గా స్కై పేరు తెచ్చుకున్నాడు. అయితే వన్డేల్లో మాత్రం ఇప్పటి వరకు స్థాయికి తగ్గట్టుగా సూర్య రాణించలేకపోయాడు.

సంజూ శాంసన్ గురించి కూడా డివిలియర్స్ మాట్లాడాడు. సంజూ అన్ని షాట్లు ఆడగలడని, అయితే వన్డే క్రికెట్‍కు అతడు అడ్జస్ట్ కావాల్సి ఉందని అన్నారు. ఐపీఎల్‍లో తాను ఆర్సీబీలో ఉన్నప్పుడు రాజస్థాన్ తరఫున సంజూ శాంసన్ ఆడిన 92 పరుగుల ఇన్నింగ్స్‌ను ఏబీడీ గుర్తు చేసుకున్నాడు.

వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ కంటే ఎక్కువ యావరేజ్ ఉన్నా.. సంజూ శాంసన్‍ను వన్డే ప్రపంచకప్ జట్టులోకి ఎందుకు తీసుకోలేదని కొందరు బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. అయితే, కొందరు మాజీలు మాజీలు మాత్రం సూర్య ఎంపికను సమర్థిస్తున్నారు.

అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19 మధ్య భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్‍తో వరల్డ్ కప్ పోరాటాన్ని భారత్ మొదలుపెట్టనుంది.

వన్డే ప్రపంచకప్ 2023కు ఎంపికైన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్‍దీప్ యాదవ్

Whats_app_banner