Harshit Rana: ఆస్ట్రేలియా టూర్ కోసం 17 కిలోలు తగ్గిన టీమిండియా క్రికెటర్.. ఐదు వికెట్లు, హాఫ్ సెంచరీతో..-harshit rana loses 17 kilos for team indias australia tour takes 5 wickets and score half century ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Harshit Rana: ఆస్ట్రేలియా టూర్ కోసం 17 కిలోలు తగ్గిన టీమిండియా క్రికెటర్.. ఐదు వికెట్లు, హాఫ్ సెంచరీతో..

Harshit Rana: ఆస్ట్రేలియా టూర్ కోసం 17 కిలోలు తగ్గిన టీమిండియా క్రికెటర్.. ఐదు వికెట్లు, హాఫ్ సెంచరీతో..

Hari Prasad S HT Telugu
Published Oct 28, 2024 03:26 PM IST

Harshit Rana: ఆస్ట్రేలియా టూర్ కోసం టీమిండియా క్రికెటర్ ఏకంగా 17 కిలోలు తగ్గడం విశేషం. అంతేకాదు తాజాగా రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఢిల్లీ తరఫున ఐదు వికెట్లు తీయడంతోపాటు 8వ స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీతో హెడ్ కోచ్ గంభీర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు.

ఆస్ట్రేలియా టూర్ కోసం 17 కిలోలు తగ్గిన టీమిండియా క్రికెటర్.. ఐదు వికెట్లు, హాఫ్ సెంచరీతో..
ఆస్ట్రేలియా టూర్ కోసం 17 కిలోలు తగ్గిన టీమిండియా క్రికెటర్.. ఐదు వికెట్లు, హాఫ్ సెంచరీతో.. (Getty)

Harshit Rana: ఆస్ట్రేలియా టూర్ అంటే కఠినమైనది. అలాంటి టూర్ కోసం ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడని ముగ్గురు ప్లేయర్స్ ను జట్టులోకి ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించింది. అందులో ఒకరు హర్షిత్ రాణా. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ఈ ఏడాది అత్యుత్తమంగా రాణించిన ఈ ఆల్ రౌండర్.. ఆస్ట్రేలియా టూర్ కోసం ఏకంగా 17 కిలోల బరువు తగ్గడం విశేషం.

17 కిలోలు తగ్గిన హర్షిత్ రాణా

నవంబర్ 22 నుంచి ప్రారంభం కాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా టెస్టు జట్టులోకి తొలిసారి ఎంపికయ్యాడు హర్షిత్ రాణా. స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి ఇంకా పూర్తి ఫిట్ గా లేకపోవడంతో బ్యాకప్ గా అతన్ని కూడా ఎంపిక చేసింది. అక్కడ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ లాంటి వాళ్లతో హర్షిత్ పేస్ బౌలింగ్ భారాన్ని పంచుకోనున్నాడు.

ఈ ఏడాది కేకేఆర్ తరఫున అద్భుతంగా రాణించడంతో అప్పుడు టీమ్ మెంటార్, ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒత్తిడి తెచ్చి మరీ హర్షిత్ ను ఎంపిక చేయించాడు. అయితే దీనికోసం హర్షిత్ కూడా బాగానే కష్టపడుతున్నాడు. తన ఫిట్‌నెస్ పై దృష్టి సారించిన ఈ ఆల్ రౌండర్.. ఏకంగా 17 కిలోల బరువు తగ్గడం విశేషం.

ఆస్ట్రేలియా టూర్‌కు రెడీ

ఒకప్పుడు తెల్లవారుఝామునే లేచి ఆస్ట్రేలియాలో ఇండియా మ్యాచ్ లను హర్షిత్ చూసేలా అతని తండ్రి ప్రదీప్ రాణా ఒత్తిడి తెచ్చేవాడు. ఇప్పుడదే ఆస్ట్రేలియా టూర్ కు హర్షిత్ ఎంపికవడం విశేషం. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడటమే తన లక్ష్యమని అతడు చెబుతున్నాడు. కెరీర్ తొలినాళ్లలో వరుస గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో హర్షిత్ సతమతమయ్యేవాడు.

ఒక దశలో అతడు మొత్తం క్రికెట్ కే దూరమయ్యే పరిస్థితి. అయితే అతడు మళ్లీ కోలుకొని ఇప్పుడు నేషనల్ టీమ్ కు ఎంపికయ్యే స్థితికి చేరడంలో హర్షిత్ కృషితోపాటు అతని తండ్రి పాత్ర కూడా చాలానే ఉంది. అందుకే తాను సాధించిన సక్సెస్ క్రెడిట్ తన తండ్రిదే అని హర్షిత్ చెబుతున్నాడు.

గంభీర్ మాట నిలబెడతాడా?

ఈ ఏడాది కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన విషయం తెలుసు కదా. అందులో హర్షిత్ కీలకపాత్ర పోషించాడు. 19 వికెట్లు తీశాడు. అప్పుడు కేకేఆర్ మెంటార్ గా ఉన్న గంభీర్.. హర్షిత్ సత్తా ఏంటో దగ్గరి నుంచి చూశాడు. దీంతో సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ కు నమ్మకం లేకపోయినా పట్టుబట్టి ఇప్పుడతన్ని ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేశాడు. నిజానికి గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత హర్షిత్ రెండుసార్లు వైట్ బాల్ జట్టుకు ఎంపికైనా తుది జట్టులో ఆడలేకపోయాడు.

ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ కు కూడా అతడు ఎంపికయ్యేలా గంభీర్ చూసుకున్నాడు. అయితే ఆ టూర్ కు ముందు గంభీర్ మాట నిలబెట్టే ప్రదర్శన చేశాడు హర్షిత్ రాణా. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున అస్సాంతో మ్యాచ్ లో హర్షిత్ 5 వికెట్లు తీయడంతోపాటు 8వ స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ కూడా చేశాడు.

దీనిపై హర్షిత్ స్పందిస్తూ.. తన స్టైల్ ఆస్ట్రేలియా ఆడే తీరుకు సరిగ్గా సరిపోతుందని, తాను దూకుడుగా ఉంటానని అతడు చెప్పడం విశేషం. ఈ టూర్ కు ఎంపికవడం తనకు చాలా గొప్ప విషయం అని కూడా అన్నాడు.

Whats_app_banner