MI vs RR Hardik Pandya: హోం గ్రౌండ్‍లోనూ హార్దిక్‍కు తప్పని ‘బూ’.. మర్యాదగా ప్రవర్తించాలన్న కామెంటేటర్: వీడియో-hardik pandya booed by audience in wankhede stadium sanjay manjrekar asked crowd to behave mi vs rr ipl 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mi Vs Rr Hardik Pandya: హోం గ్రౌండ్‍లోనూ హార్దిక్‍కు తప్పని ‘బూ’.. మర్యాదగా ప్రవర్తించాలన్న కామెంటేటర్: వీడియో

MI vs RR Hardik Pandya: హోం గ్రౌండ్‍లోనూ హార్దిక్‍కు తప్పని ‘బూ’.. మర్యాదగా ప్రవర్తించాలన్న కామెంటేటర్: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 01, 2024 07:48 PM IST

IPL 2024 MI vs RR: ఐపీఎల్ 2024 సీజన్‍‍లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. ఈ సీజన్‍లో తొలిసారి హోం గ్రౌండ్‍లో బరిలోకి దిగింది ముంబై. ఈ మ్యాచ్‍ టాస్ సమయంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి బూ అంటూ అరిచారు ప్రేక్షకులు.

MI vs RR Hardik Pandya: హోం గ్రౌండ్‍లోనూ హార్దిక్‍కు తప్పని ‘బూ’.. మర్యాదగా ప్రవర్తించాలన్న కామెంటేటర్: వీడియో
MI vs RR Hardik Pandya: హోం గ్రౌండ్‍లోనూ హార్దిక్‍కు తప్పని ‘బూ’.. మర్యాదగా ప్రవర్తించాలన్న కామెంటేటర్: వీడియో

MI vs RR: ఐపీఎల్ 2024 సీజన్‍లో తన తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడిన ముంబై ఇండియన్స్.. మూడో పోరుకు బరిలోకి దిగింది. ఈ సీజన్‍లో తొలిసారి తన హోం గ్రౌండ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేడు ఆడుతోంది. ఐపీఎల్ 17వ సీజన్‍లో నేడు (ఏప్రిల్ 1) ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టాక వాంఖడేలో ముంబై తొలిసారి ఆడుతుండటంతో ఈ మ్యాచ్‍పై విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

హార్దిక్‍కు ‘బూ’

ఐపీఎల్ 2024 సీజన్ కోసం రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్‍ను చేసింది ముంబై ఇండియన్స్. దీంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అసంతృప్తి చెందారు. ఇది జరిగాక తొలిసారి హోం గ్రౌండ్ వాంఖడేలో మ్యాచ్‍కు నేడు బరిలోకి దిగింది ముంబై. అయితే, హార్దిక్ పాండ్యా టాస్‍కు వచ్చిన సమయంలో ముంబై ప్రేక్షకులు బూ అంటూ గట్టిగా అరిచారు. రోహిత్‍ను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్‍కు ఆ బాధ్యతలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సీజన్‍లో గత రెండు మ్యాచ్‍ల్లోనూ హార్దిక్‍కు ఇలాంటి అనుభవం ఎదురైంది. ఇప్పుడు హోం గ్రౌండ్‍లోనూ ఇలాగే జరిగింది.

ప్రేక్షకులు బూ అని గట్టిగా అరుస్తుండటంతో టాస్ వద్ద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కల్పించుకున్నారు. ప్రేక్షకులు మర్యాదగా ప్రవర్తించాలని, హార్దిక్‍ను అభినందించాలని కోరారు.

పేసర్ సందీప్ శర్మ ఫిట్‍గా లేకపోవటంతో రాజస్థాన్ తుది జట్టులోకి నాండ్రే బర్గర్ వచ్చాడు. ఈ సీజన్‍లో రెండు మ్యాచ్‍ల్లో రెండింట గెలిచి ఫుల్ ఫామ్‍లో ఉంది సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్. ఈ మ్యాచ్‍లోనూ గెలిచి హ్యాట్రిక్ గెలుపు సాధించాలని పట్టుదలగా ఉంది. ముంబై బోణీ కొట్టాలని కసితో ఉంది.

ఐపీఎల్‍లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఇది 250వ మ్యాచ్‍గా ఉంది. ఐపీఎల్‍లో ఈ మార్క్ చేరిన తొలి టీమ్‍గా ముంబై నిలిచింది. ఇక, రాజస్థాన్ రాయల్స్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‍కు ఇది 200వ ఐపీఎల్ మ్యాచ్‍గా ఉంది.

ముంబై ఇండియన్స్ తుదిజట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, గెలాల్డ్ కోట్జీ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జస్‍ప్రీత్ బుమ్రా, క్వెనా ఎంఫకా

ముంబై సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: డెవాల్డ్ బ్రెవిస్, నువాన్ తుషారా, రొమారియో షెఫర్డ్, నేహాల్ వదేరా, షామ్స్ ములానీ

రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రన్ హిట్మైర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, నాండ్రే బర్గర్, యుజువేంద్ర చాహల్

రాజస్థాన్ సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: రవ్మాన్ పోవెల్, టనుష్ కొటియన్, కుల్దీప్ సేన్, శుభం దూబే, అబిద్ ముస్తాక్