Ashwin Jadeja: టెస్ట్‌ల్లో అశ్విన్, జడేజా జోడీ కొత్త రికార్డ్ - 5 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
Ashwin Jadeja: హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఫస్ట్ టెస్ట్‌లో అశ్విన్, జడేజా జోడీ సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లను తీసిన జోడీగా కుంబ్లే, హర్భజన్ రికార్డును అశ్విన్, జడేజా బ్రేక్ చేశారు.
Ashwin Jadeja: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగిస్తోంది. అశ్విన్, జడేజా జోడీ ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టారు. వీరిద్దరి స్పిన్ ధాటికి ఐదు రన్స్ తేడాతో ఇంగ్లాండ్ మూడు వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. 55 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు ఇంగ్లాండ్. ఓపెనర్లు క్రాలీ, డకెట్ ఒక్కో పరుగు తీస్తూ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు.
డకెట్‌ను (35రన్స్)ను ఔట్ చేసి టీమిండియాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు అశ్విన్. ధాటిగా ఆడిన డకెట్ 39 బాల్స్‌లో ఏడు ఫోర్లతో 35 రన్స్ చేశాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. 14 ఓవర్‌లో ఓలీ పోప్‌ను పెవిలియన్‌కు పంపించాడు జడేజా. జడేజా బౌలింగ్‌లో రోహిత్ క్యాచ్ ఇచ్చిన పోప్ కేవలం ఒక పరుగు వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే క్రాలీని ఔట్ చేశాడు అశ్విన్. కేవలం ఐదు పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం బెయిర్ స్టో, రూట్ క్రీజులో ఉన్నారు.
అశ్విన్, జడేజా జోడీ రికార్డ్...
టెస్టుల్లో అశ్విన్, జడేజా జోడీ కొత్త రికార్డ్‌ను నెలకొల్పారు. ఈ ఇద్దరు కలిసి టెస్ట్ క్రికెట్‌లో 503 వికెట్స్ తీసుకున్నారు. టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న జోడీగా అశ్విన్, జడేజా నిలిచారు. గతంలో 501 పరుగులతో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. వారి రికార్డ్‌ను ఫస్ట్ టెస్ట్‌తో జడేజా, అశ్విన్ జోడీ తిరగరాసింది. వీరి తర్వాత జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ జోడీ 474 వికెట్లతో మూడో స్థానంలో నిలవగా...అశ్విన్, ఉమేష్ జోడీ 431 వికెట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. వరల్డ్ వైడ్‌గా ఇంగ్లాండ్ పేసర్స్ స్టూవర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ జోడీ 1039 వికెట్లతో మొదటి స్థానంలో ఉంది.
ఐదు వందల వికెట్లకు చేరువలో...
అశ్విన్ టెస్టుల్లో ఐదు వందల వికెట్లకు చేరువయ్యాడు. ప్రస్తుతం 492 వికెట్లతో ఉన్న అశ్విన్ మరో ఎనిమిది వికెట్లు తీస్తే ఐదు వందల వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. ప్రస్తుతం టీమిండియా తరఫున 619 వికెట్లతో కుంబ్లే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అతడి తర్వాత 492 వికెట్లతో అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతోంది. 276 వికెట్లతో జడేజా ఏడో స్థానంలో ఉన్నాడు. ఫస్ట్ టెస్ట్‌తోనే అశ్విన్ ఐదు వందల వికెట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌లో టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా ఫస్ట్ టెస్ట్ జరుగుతోంది. జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఈ టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతన్నాయి. తొలి రెండు టెస్ట్‌లకు వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లి దూరం కావడంతో అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చాడు.