Budget 2024 : ‘రియల్​ ఎస్టేట్​లో భారీ సంస్కరణలు కావాలి’- నిర్మల బడ్జెట్​పై ఆశలు-union budget 2024 indias real estate sector anticipates major reforms ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2024 : ‘రియల్​ ఎస్టేట్​లో భారీ సంస్కరణలు కావాలి’- నిర్మల బడ్జెట్​పై ఆశలు

Budget 2024 : ‘రియల్​ ఎస్టేట్​లో భారీ సంస్కరణలు కావాలి’- నిర్మల బడ్జెట్​పై ఆశలు

Sharath Chitturi HT Telugu
Jul 20, 2024 11:16 AM IST

Real estate Budget 2024 : బడ్జెట్​ 2024పై రియల్​ ఎస్టెట్​ రంగం భారీ అంచనాలు పెట్టుకుంది. భారీ సంస్కరణలు కావాలని కోరుతోంది.

రియల్​ ఎస్టేట్​లో భారీ సంస్కరణలు కావాలి!
రియల్​ ఎస్టేట్​లో భారీ సంస్కరణలు కావాలి!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ జులై 23న ప్రవేశపెట్టే బడ్జెట్​ 2024పై భారీ అంచనాలు ఉన్నాయి. మోడీ 3.0లో తొలి బడ్జెట్​ కావడంతో మధ్య తరగతి ప్రజల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు అందరు, అన్ని రంగాల వారు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరీ ముఖ్యంగా రియల్​ ఎస్టేట్​ వ్యాపారంలో కీలక సంస్కరణల అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్​కమ్​ ట్యాక్స్​ చట్టాల్లో రిబేట్​ విషయంపై ప్రభుత్వం ఆలోచించాలని ప్రముఖ రియల్​ ఎస్టేట్​ డెవలపర్స్​ సంస్థ సట్వా గ్రూప్​ ఎండీ బిజయ్​ అగర్వాల్​ అభిప్రాయపడ్డారు.

"ప్రధానమంత్రి ఆవాస్​ యోజన కింద చౌకైన ధరలకు ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం సంతోషంకరం. మధ్య తరగతి ప్రజలకు కొత్త ఇళ్ల పథకం కలిసొస్తుంది. 'అందరికి ఇల్లు' అనే కాన్సెప్ట్​కి ఈ చర్యలు మద్దతిస్తాయి. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ప్రజలకు ఇదొక మంచి అవకాశంగా ఉంటుంది," అన్నారు.

అఫార్డిబుల్​ హౌజింగ్​ రంగంలో డెవలపర్స్​ ప్రవేశించడం కోసం ఇన్​కమ్​ ట్యాక్స్​ చట్టంలోని రిబేట్​ని విస్తరించాలని బిజాయ్​ అగర్వాల్​ అభిప్రాయపడ్డారు. ఇళ్ల లోన్​పై వడ్డీ రేట్లను తగ్గించాలన్నారు. వడ్డీ రేటు తక్కువగా ఉంటే రెసిడెన్షియల్​ రియల్​ ఎస్టేట్​కి డిమాండ్​ పెరుగుతుందని, ఇళ్ల నిర్మాణం కోసం ఫైనాన్స్​ అనేది మరింత సులభమతరం అవుతుందని అన్నారు. డెవలపర్స్​కి మరిన్న ఆర్థికపరమైన ఆప్షన్స్​ అందుబాటులోకి వస్తే, మార్కెట్​లోకి క్యాపిటల్​ ఫ్లో అవ్వడానికి ఉపయోగపడుతుందన్నారు.

స్వాహిమ్​ ఫండ్​కి ప్రభుత్వం మద్దతివ్వాలని, సింగల్​ విండో క్లియరెన్స్​పై యోచిస్తుందని ఆశిస్తున్నట్టు సట్వా గ్రూప్​ ఎండీ అభిప్రాయపడ్డారు. ఈ తరహా మార్పులు తీసుకొస్తే రియల్​ ఎస్టేట్​ పరిశ్రమతో పాటు భారత దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది అన్నారు.

బడ్జెట్​పై రియల్​ ఎస్టేట్​ అంచనాలు..

కార్పొరేట్ ట్యాక్స్ బెనిఫిట్స్ అందరికీ వర్తింపజేయాలని, సర్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని, పన్ను విధానాలను సమగ్రంగా సవరించాలని నారెడ్కో చైర్మన్ నిరంజన్ హీరానందానీ సూచించారు. ఇతర అంచనాలు..

గృహ రుణాలపై చెల్లించే వడ్డీ మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం, ఈక్విటీ షేర్లతో సమానంగా దీర్ఘకాలిక మూలధన లాభాలను 10 శాతానికి తీసుకురావడం.

దీర్ఘకాలిక మూలధన ఆస్తిగా అర్హత పొందడానికి ఇంటి ఆస్తిని కలిగి ఉన్న కాలాన్ని ప్రస్తుతమున్న 24/36 నెలల నుంచి 12 నెలలకు తగ్గించడం.

పన్ను వసూళ్లు పెరగడంతో తాత్కాలిక చర్యగా ప్రవేశపెట్టిన సర్ ఛార్జీని ఉపసంహరించుకోవాలి.

రెసిడెంట్, నాన్ రెసిడెంట్ ఇన్వెస్టర్ల మధ్య వివక్షను నివారించడానికి రెసిడెంట్ ఇన్వెస్టర్ల డివిడెండ్ పన్ను రేటును 10% వద్ద ఉంచవచ్చు.

జాన్సన్ కంట్రోల్స్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ అవస్థి మాట్లాడుతూ, “కొత్త గ్రీన్ డీల్ ఆధారంగా రాబోయే కేంద్ర బడ్జెట్ భారతదేశ మౌలిక సదుపాయాల నిర్మాణ ఇంధన సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా దృష్టి పెడుతుందని మేము ఆశాభావంతో ఉన్నాము,” అని అన్నారు.

మరి రియల్​ ఎస్టేట్​ రంగం అంచనాలను నిర్మల బడ్జెట్​ అందుకుంటుందా? లేదా? అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం