No Income Tax for life : ఇలా చేస్తే.. జీవితం మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు!
No Income Tax for life : ఆదాయపు పన్ను చెల్లింపుల సమయంలో కనిపించే బాధ అంతా ఇంతా కాదు! కానీ జీవితం మొత్తం మీద అసలు ట్యాక్స్ కట్టక్కర్లేదని ప్రభుత్వమే చెబితే..?
No Income Tax for life : ఆదాయపు పన్ను చెల్లించడం వల్ల తరచుగా సగటు వ్యక్తి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ట్యాక్స్ కట్టేడప్పుడు ఆ బాధ అంతా ఇంతా కాదు! కానీ ప్రభుత్వం మిమ్మల్ని జీవితాంతం పన్నుల నుంచి మినహాయించే చర్యలను ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? ఆ ఊహే.. అద్భుతంగా ఉంది కదు! ఇది నిజం కాబోతోంది! కానీ ఇండియాలో కాదు. హంగేరీలో! జీవితం మొత్తం ఆదాయపు పన్ను చెల్లించకుండా.. ప్రజలకు ఒక ఆఫర్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే..
జీవితం మొత్తం 0 ట్యాక్స్.. కానీ!
బర్త్ రేట్ వేగంగా పడిపోతున్న యూరోపియన్ దేశాల్లో హంగేరీ ఒకటి. హంగేరీలో ప్రజలు పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు. అందుకే.. వివాహాలు, పిల్లల్ని కనేందుకు ప్రోత్సహించడం, వలసల రేటును అరికట్టడం లక్ష్యంగా పలు చర్యలను ప్రకటించారు హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్.
Hungary birth rate : "ఐరోపాలో తక్కువ మంది పిల్లలు పుడుతున్నారు. ఈ సవాలు పాశ్చాత్య దేశాల్లో కూడా ఉంది. ‘ఇమ్మిగ్రెంట్స్’ రూపంలో వారి సవాలుకు పరిష్కారం లభించింది. అందుకే ఎక్కువ మంది వలసదారులను దేశాల్లో రానిస్తున్నాయి. తద్వారా పిల్లల సంఖ్య పెరుగుతుందని వారు అనుకుంటున్నారు. కానీ మా హంగేరియన్ల ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుంది," అని విక్టర్ అన్నారు.
నలుగురు అంతకన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి.. జీవితం మొత్తం.. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపును ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. పెద్ద కుటుంబాలు పెద్ద కార్లను కొనుగోలు చేయడానికి సబ్సిడీని కూడా ప్రకటించింది. జనాభాను పెంచే కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా 21,000 శిశుగృహాలను తెరవనున్నట్లు వెల్లడించింది. అంటే.. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళితే, వారి పిల్లల్ని ఈ శిశుగ్రుహాలు చూసుకుంటాయి.
Hungary government new tax rule : విక్టర్ ఓర్బాన్ మాట్లాడుతూ.. దేశానికి ఎక్కువ మంది హంగేరియన్ పిల్లలు అవసరమని అన్నారు.
"మిశ్రమ జనాభా దేశాలను" విమర్శిస్తూ, విక్టర్ ఓర్బాన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
“ఐరోపా ప్రజలు హిస్టారిక్ క్రాస్ఓవర్కి వచ్చారు. క్రీస్టియన్ దేశాల్లో త్వరలోనే క్రైస్తవులు మైనారిటీలోకి జారుకునే ప్రమాదం ఉంది,” అని హంగేరీ ప్రధాని అభిప్రాయపడ్డారు.
వాస్తవానికి.. హంగేరీలో పిల్లల్ని కనడమే కాదు.. కొన్నేళ్ల ముందువరకు పెళ్లి పట్ల కూడా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు కూడా ప్రభుత్వం.. పథకాలను తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వధువు 41వ పుట్టినరోజుకు ముందు వివాహం చేసుకున్న జంటలకు 10 మిలియన్ ఫోర్ంట్స్ (33,000 డాలర్లు) వరకు సబ్సిడీ రుణాలను అందిస్తూ 2019లో.. ఒక కొత్త పథకం తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. అంతేకాదు.. ఇద్దరు పిల్లలు ఉంటే.. ఇచ్చిన రుణంలో మూడో వంతు మాఫీ అవుతుందని, ముగ్గురు ఉంటే మొత్తం రుణం మాఫీ చేస్తామని ఆ పథకంలో ఉంది.
మరి పిల్లల్ని కనేందుకు హంగేరీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చర్యలపై మీరేం అంటారు?
సంబంధిత కథనం