TVS Raider 125 SmartXonnect । టీవీఎస్ సరికొత్త మోటార్‌సైకిల్.. స్టైల్‌గా దూసుకుపోండి!
ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ తాజాగా 125 సిసి సెగ్మెంట్లో TVS Raider 125 SmartXonnect అనే సరికొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. దీని ధర, ఫీచర్లు, మైలేజ్ మొదలైన విశేషాలు తెలుసుకోండి.
TVS మోటార్ కంపెనీ తమ రైడర్ 125 బైక్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా TVS Raider 125 SmartXonnect మోటార్‌సైకిల్‌ను ఈరోజు విడుదల చేసింది. దీనితో పాటుగా 'TVS మోటోవర్స్' అనే దాని మెటావర్స్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా ఆవిష్కరించింది. తాజా మోడల్ విడుదలతో ఇప్పుడు రైడర్ 125 ఇప్పుడు మూడు మోడళ్లలో అందుబాటులో ఉంది. డ్రమ్, డిస్క్ తొలి రెండు మోడళ్లు కాగా, ఇప్పుడు ఇందులో SmartXonnect అనేది సరికొత్త వేరియంట్.
కొత్త TVS Raider 125 SmartXonnect అనేది ఒక ప్రీమియం కమ్యూటర్ బైక్. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన SmartXonnect సిస్టమ్‌తో వచ్చింది. ఇందులో భాగంగా వాయిస్-అసిస్టెంట్ ఫీచర్లు, ఫుల్-కలర్ TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది. దీని సహాయంతో మీరు మీ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని కాల్‌లు, SMS, నోటిఫికేషన్‌లను సులువుగా యాక్సెస్ చేయవచ్చు, మ్యూజిక్ ప్లే చేయవచ్చు.
అలాగే TFT స్క్రీన్‌పై దిశల సూచికతో పాటు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను అందిస్తుంది. నిల్వ ఇంధనం రీడింగ్ సహా సమీప ఇంధన స్టేషన్‌కు చేరుకోవడంలో మీకు సహాయపడుతుంది.
TVS Raider 125 SmartXonnect డిజైన్
2022 TVS రైడర్ 125 SmartXonnect దూసుకుపోయే డిజైన్ ఫిలాసఫీని కలిగి ఉంది. ఎక్స్‌టెన్షన్‌లతో కూడిన దృఢమైన 10-లీటర్ ఇంధన ట్యాంక్, ఇంటిగ్రేటెడ్ X-ఆకారపు DRLలతో LED హెడ్‌లైట్, స్ల్పిట్-స్టైల్ సీట్లు, అప్‌స్వేప్ట్ ఎగ్జాస్ట్, సొగసైన LED టెయిల్‌లైట్‌ను కలిగి ఉంది.ఇది 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై పరుగెడుతుంది.
TVS Raider 125 SmartXonnect ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
సరికొత్త టీవీఎస్ రైడర్ 125 SmartXonnect మోటార్‌సైకిల్‌లో 124.8cc సామర్థ్యం కలిగిన సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ అమర్చారు. దీనిని 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 11.2hp శక్తిని, 11.2Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇతర హార్డ్ వేర్ అంశాలను పరిశీలిస్తే, ఈ బైక్‌లో మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) ను అందించారు. ముందు చక్రానికి డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి డ్రమ్ బ్రేక్‌ను అమర్చారు. సస్పెన్షన్ కోసం మోటార్‌సైకిల్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో గ్యాస్-ఛార్జ్డ్ మోనో-షాక్ యూనిట్ అందించారు.
TVS Raider 125 SmartXonnect ధర, మైలేజ్
సరికొత్త TVS Raider 125 SmartXonnect బైక్ ధర ఎక్స్- షోరూం వద్ద రూ. 99,990/- గా ఉంది. అంటే ఇది డ్రమ్ మోడల్ కంటే దాదాపు రూ. 14,000 ఎక్కువ, అలాగే డిస్క్ బ్రేక్ మోడల్ కంటే దాదాపు రూ. 6,000 ఎక్కువ. మైలేజ్ పరంగా TVS Raider 125 లీటరుకు సుమారు 60 కిమీ పైగా మైలేజ్ అందిస్తుందని అంచనా.
TVS Raider 125 SmartXonnect మార్కెట్లో హోండా SP125, కీవే SR125, హీరో గ్లామర్ 125 , బజాజ్ పల్సర్ 125 వంటి సెగ్మెంట్ బైక్ లకు పోటీగా ఉంటుంది.
సంబంధిత కథనం