Keeway SR125 । కీవే నుంచి రెట్రో మోడల్ బైక్ విడుదల.. ధర అన్నింటికంటే తక్కువ!-keeway sr125 motorocycle launched check price mileage and all details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Keeway Sr125 Motorocycle Launched, Check Price, Mileage And All Details

Keeway SR125 । కీవే నుంచి రెట్రో మోడల్ బైక్ విడుదల.. ధర అన్నింటికంటే తక్కువ!

HT Telugu Desk HT Telugu
Oct 13, 2022 07:28 PM IST

కీవే నుంచి 125సిసి ఇంజన్ కెపాసిటీ కలిగిన Keeway SR125 మోటార్ సైకిల్ భారత మార్కెట్లో విడుదలైంది. దీని ధర, ఇతర వివరాలను ఇక్కడ చూడండి.

Keeway SR125
Keeway SR125

హంగేరియన్ బ్రాండ్ కీవే తాజాగా మరో మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Keeway SR125 పేరుతో విడుదలైన ఈ బైక్ మిడ్- రేంజ్ బడ్జెట్ లో లభిస్తుంది. ఇది రెట్రో-స్టైల్ డిజైన్‌ను కలిగి ఉంది. ముందువైపు చిన్నని రౌండ్ లైట్, వైర్-స్పోక్ వీల్స్, డ్యూయల్-పర్పస్ టైర్లు, సింగిల్ పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి 90ల నాటి బైక్ మోడల్ ను తలపిస్తుంది. ఈ Keeway SR125 అనేది ఈ బ్రాండ్ నుంచి భారతదేశంలో విడుదలైన ఏడవ మోడల్ బైక్, అలాగే అన్నింటికంటే తక్కువ ధర కలిగినది.

Keeway SR125 బైక్ బుకింగ్‌లు ఇప్పుడు ప్రారంభమైనాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అలాగే డీలర్‌షిప్‌ స్టోరలలో రూ. 1,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు. బెనెల్లీ, కీవే డీలర్‌షిప్‌ల ద్వారా ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాది అక్టోబర్ చివరి వారం నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ కొత్తబైక్ గ్లాసీ రెడ్, గ్లోసీ వైట్, గ్లోసీ బ్లాక్ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

మరి ఈ సర్రికొత్త మోటార్‌సైకిల్‌ ధర ఎంత, దీని ఇంజన్ సామర్థ్యం ఏ మేరకు ఉంది, దీనిలో ఫీచర్లు ఏమున్నాయి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Keeway SR125 Bike Engine Specifications

కీవే SR125 మోటార్‌సైకిల్‌లో 125cc స్మార్థ్యం కలిగిన ఫోర్-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్ అమర్చారు. దీనిని 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఈ ఇంజన్ 9,000 rpm వద్ద 9.5 bhp శక్తిని 7,500 rpm వద్ద 8.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ మోటార్‌సైకిల్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌తో వచ్చింది. ముందువైపు 300mm డిస్క్ అలాగే వెనుకవైపు సింగిల్ 210mm రోటర్‌ను కలిగి ఉంటుంది. సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫంక్షన్‌ కూడా ఉంది. దీంతో సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు ఇంజన్ ఆన్- అవదు. కీవే SR125 కేవలం 120 కిలోల బరువును కలిగి ఉంది. దీనికి 14.5 లీటర్ ఇంధన ట్యాంక్‌ను అమర్చారు.

Keeway SR125 Bike Price

కీవే SR125 మోటార్‌సైకిల్‌ ధర, ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1,19,000/- గా ఉంది. ధరల పరంగా ఈ బైక్ మార్కెట్లో TVS Apache RTR 160 2V అలాగే హోండా X-బ్లేడ్ వంటి మోటార్ సైకిళ్లతో పోటీపడుతుంది. అయితే ఆ మోటార్‌సైకిళ్లు 160cc ఇంజన్ తో వచ్చాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్