Honda Shine Celebration Edition। మరింత ఆకర్షణీయమైన రూపంలో వచ్చిన హోండా షైన్!
పండగ సీజన్లో వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు కాబట్టి హోండా టూవీలర్స్ తమ బెస్ట్ సెల్లర్ బైక్ మోడల్ 'హోండా షైన్' లో Honda Shine Celebration Editionను లాంచ్ చేసింది. దీని విశేషాలు తెలుసుకోండి.
రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా 2-వీలర్స్ తమ బ్రాండ్ నుంచి భారత మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉన్న మోటార్‌బైక్ మోడల్ 'హోండా షైన్' లో సరికొత్త సెలబ్రేషన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త Honda Shine Celebration Edition బైక్ డిజైన్ పరంగా కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లతో మాత్రమే వచ్చింది. మిగతా హార్డ్‌వేర్ అంశాల పరంగా, యాక్సెసరీల జాబితా చాలావరకు ప్రామాణిక మోడల్‌తో సమానంగానే ఉంటుంది. అయితే స్టాండర్డ్ మోడల్‌తో పోల్చితే హోండా షైన్ సెలబ్రేషన్ ఎడిషన్ మరింత మెరుగైన రూపంతో వచ్చింది. చూడటానికి కొద్దిగా ప్రీమియం మోటార్‌సైకిల్‌లా కనిపిస్తుంది.
షైన్ సెలబ్రేషన్ ఎడిషన్ మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్, మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్ అనే రెండు కలర్ షేడ్స్‌లో లభ్యమవుతోంది. అలాగే డ్రమ్, డిస్క్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 78,878/-. స్టాండర్డ్ షైన్ వేరియంట్ తో పోల్చితే సుమారు రూ. 1,500 ఎక్కువ.
స్పెషల్ ఎడిషన్ బైక్ కొత్త గోల్డెన్ థీమ్‌ను కూడా పొందింది. గ్రాఫిక్స్ ఒకే లేఅవుట్‌ను కలిగి ఉన్నప్పటికీ, అవి అద్భుతమైన గోల్డెన్ షేడ్‌లో చేయబడ్డాయి. గోల్డెన్ వింగ్‌మార్క్ చిహ్నం, టెయిల్ విభాగంలో షైన్ లోగో అలాగే ఇంధన ట్యాంక్ మీద సెలబ్రేషన్ ఎడిషన్ లోగో ఇచ్చారు. హెడ్‌ల్యాంప్ కౌల్, సైడ్ ప్యానెల్‌లు కూడా గోల్డెన్ గార్నిష్‌తో వచ్చాయి. రెండు కలర్ షేడ్లలో మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్ షేడ్ కలిగిన బైక్ మోడల్ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ఇంజన్ కెపాసిటీ, మైలేజ్
హోండా షైన్ బైక్ లో 123.94cc ఇంజన్ ఉంటుంది. దీనిని మల్టీప్లేట్ వెట్ క్లచ్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. దీని ఇంజన్ 7,500 rpm వద్ద 10.74 PS గరిష్ట శక్తిని అలాగే 6,000 rpm వద్ద 11 Nm గరిష్ట టార్క్‌ను
ఈ బైక్ సిటీలో లీటరుకు 50-55 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది, హైవేలపై అయితే లీటరుకు 60-65 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
ఈ బైక్ భారత రోడ్లపై Bajaj CT125X, TVS రేడియన్, హీరో గ్లామర్ తదితర 125సీసీ బైక్ లతో పోటీపడుతుంది.
సంబంధిత కథనం