Bajaj Pulsar 250 Eclipse Edition । బజాజ్ పల్సర్‌లో మరో స్టైలిష్ ఎడిషన్..!-bajaj pulsar 250 eclipse edition to be launched soon price details here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Bajaj Pulsar 250 Eclipse Edition To Be Launched Soon Price Details Here

Bajaj Pulsar 250 Eclipse Edition । బజాజ్ పల్సర్‌లో మరో స్టైలిష్ ఎడిషన్..!

HT Telugu Desk HT Telugu
Jun 20, 2022 01:40 PM IST

టూవీలర్ తయారీదారు బజాజ్ తమ పాపులర్ మోడల్ మోటార్ సైకిల్ 'పల్సర్' లో కొత్తగా ఎక్లిప్స్ ఎడిషన్ (Bajaj Pulsar Eclipse Edition) ను ఈ నెలాఖరులో లాంచ్ చేయనుంది. బాగా హైప్ క్రియేట్ అవుతున్న ఈ బైక్ విశేషాలు ఇలా ఉండవచ్చు.

Bajaj Pulsar N250 Eclipsed Edition
Bajaj Pulsar N250 Eclipsed Edition

దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ బ్రాండ్ నుంచి పాపులర్ మోడల్ అయిన పల్సర్ లో సరికొత్త 250సిసి మోటార్‌సైకిల్‌ను తీసుకురాబోతుంది. త్వరలోనే ఈ బైక్ భారత మార్కెట్లో విడుదలవుతుంది. 'పల్సర్ 250 ఎక్లిప్స్ ఎడిషన్' పేరుతో వస్తున్న ఈ బైక్ ఎలా ఉండబోతుందనేది బజాజ్ ఒక టీజర్‌ను విడుదల చేసింది.  ఈ బైక్ పల్సర్ సిరీస్ లో టాప్ వేరియంట్‌లలో ఒకటి అని చెప్పవచ్చు.

బజాజ్ కంపెనీ గతేడాది అక్టోబర్‌లో పల్సర్ 250 సిరీస్‌ను ప్రవేశపెట్టింది. వీటిలో పల్సర్ ఎన్250, పల్సర్ ఎఫ్250 మోటార్ సైకిళ్లు ఉన్నాయి. టెక్నో గ్రే, రేసింగ్ రెడ్ అలాగే కరేబియన్ బ్లూ అనే మూడు రంగుల్లో ఇవి లభ్యమవుతున్నాయి. కాగా ఇప్పుడు రాబోయే ఎక్లిప్స్ ఎడిషన్ కొత్త పెయింట్ స్కీమ్‌తో రావొచ్చు. టీజర్ ప్రకారంగా బైక్ మొత్తం బ్లాక్ ఫినిషింగ్‌లో 2022 పల్సర్ కనిపిస్తుంది.

ఈ బైక్ మీద బజాజ్ కంపెనీ చాలా హైప్ క్రియేట్ చేస్తుంది. అయినప్పటికీ సరికొత్త బజాజ్ పల్సర్ 250 ఎక్లిప్స్ ఎడిషన్ ఇతర 250cc పల్సర్‌ల మాదిరిగానే 250cc ఇంజన్‌తోనే వస్తుంది. కొత్తగా కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను మాత్రమే పొందవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పల్సర్ 250 ఎక్లిప్స్ ఎడిషన్ చాలా మటుకు పల్సర్ N250 (నేక్డ్ వెర్షన్)పై ఆధారపడి ఉంటుంది. పవర్ ఫిగర్‌లు ఒకే విధంగా ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇంజన్ కెపాసిటీ

ఇప్పటివరకు వచ్చిన అన్ని పల్సర్ మోడళ్లలో 'పల్సర్ 250' టాప్ వేరియంట్ గా ఉంది. ఇందులో అధునాతన 250cc, 4-స్ట్రోక్ ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 8750 rpm వద్ద గరిష్టంగా 24.5 PS శక్తిని విడుదల చేస్తుంది. ఇంజిన్ గరిష్ట టార్క్ 6500 rpm వద్ద 21.5 Nm. ఈ ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ తో జతచేశారు. బ్రేకింగ్ పరంగా, బైక్ సింగిల్-ఛానల్ ABS తో 300mm ఫ్రంట్ డిస్క్, 230mm వెనుక డిస్క్‌లను కలిగి ఉంది. పల్సర్ 250 సిసి ధరలు ఎక్స్-షోరూం వద్ద రూ. 1.44 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు రాబోయే పల్సర్ 250 ఎక్లిప్స్ ఎడిషన్ ధర ఎంత మేర ఉంటుందో మరి కొన్నిరోజుల్లో తెలుస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్