2022 Honda Dio Sports | మరింత ట్రెండీగా హోండా డియో లిమెటెడ్ ఎడిషన్ స్కూటర్!-honda dio sports limited edition scooter launched know on road price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  2022 Honda Dio Sports | మరింత ట్రెండీగా హోండా డియో లిమెటెడ్ ఎడిషన్ స్కూటర్!

2022 Honda Dio Sports | మరింత ట్రెండీగా హోండా డియో లిమెటెడ్ ఎడిషన్ స్కూటర్!

HT Telugu Desk HT Telugu
Aug 03, 2022 03:48 PM IST

హోండా మోటార్ సైకిల్ ఇండియా నుంచి హోండా డియో స్కూటర్ 2022 పరిమిత ఎడిషన్ స్పోర్ట్స్ వెర్షన్‌ విడుదలయింది. ఎక్స్-షోరూంలో ధర రూ. 68,317/- నుంచి ప్రారంభమవుతుంది.

Honda Dio Sports limited-edition
Honda Dio Sports limited-edition

హోండా మోటార్ సైకిల్ సంస్థ తమ బ్రాండ్ నుంచి ప్రసిద్ధ స్కూటర్ మోడల్ అయినటువంటి హోండా డియోలో సరికొత్తగా లిమిటెడ్ ఎడిషన్ డియో స్పోర్ట్స్‌ను (Honda Dio Sports limited-edition) భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ 2022 హోండా డియో స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్ ధర ఢిల్లీ ఎక్స్-షోరూంలో రూ. 68,317/- నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ స్టాండర్డ్ ఇంకా డీలక్స్ అనే రెండు స్కూటర్ 2 వేరియంట్‌లలో అందిస్తున్నారు.

ఇంతకుముందు పేర్కొన్న ధర స్టాండర్డ్ వేరియంట్ కోసం కాగా, డీలక్స్ వేరియంట్ కోసం ధర రూ. 73,317/- గా ఉంది. స్టాండర్డ్ వేరియంట్ కంటే రూ. 10 అదనం. అలాగే ఈ లిమిటెడ్ ఎడిషన్ డియో స్పోర్ట్స్‌ స్కూటర్ స్ట్రోంటియమ్ సిల్వర్ మెటాలిక్ విత్ బ్లాక్ , స్పోర్ట్స్ రెడ్ విత్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన రిఫ్రెష్ డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లలో కలర్ స్క్రీముల్లో లభిస్తుంది. బాడీ ప్యానెల్స్‌పై వచ్చిన ఫంకీ గ్రాఫిక్‌లు ఈ స్కూటర్‌ను ట్రెండీగా కనిపించేలా చేస్తున్నాయి.

Honda Dio Sports limited-edition కొనుగోలుపై ఆసక్తి గల కస్టమర్‌లు ఇప్పుడు నేరుగా వారి సమీప హోండా రెడ్‌వింగ్ డీలర్‌షిప్‌లో టెస్ట్ రైడ్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు.

Honda Dio Sports limited-edition ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ డియో స్పోర్ట్స్‌లో 110cc PGM-FI ఇంజిన్ ఉంటుంది. ఇది మెరుగైన స్మార్ట్ పవర్ (eSP)తో వచ్చింది. ఈ ఇంజన్ గరిష్టంగా 7.76bhp గరిష్ట శక్తిని అలాగే 9Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనిని CVT గేర్‌బాక్స్‌కు అనుసంధానం చేశారు.

ఇంధనం సేవ్ చేసే విధంగా ఇందులో 3-దశల ఎకో ఇండికేటర్‌ను అమర్చారు. సస్పెన్షన్ కోసం ముందువైపు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపున డ్యూయల్ స్ప్రింగ్‌లు ఉన్నాయి.

మరిన్ని అంశాలను పరిశీలిస్తే.. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఫంక్షన్ స్విచ్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ క్యాప్, పాసింగ్ స్విచ్ , సైడ్ స్టాండ్ ఇండికేటర్ (ఇంజిన్ కట్-ఆఫ్‌తో) వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో ఈక్వలైజర్‌తో కూడిన కాంబి-బ్రేక్ సిస్టమ్ (CBS) కూడా వస్తుంది. ఇది స్కూటర్‌ భద్రతను పెంచుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్