Top premium smartphones : 2024లో.. బెస్ట్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ ఇదే..!-tech news top premium smartphones in 2024 samsung galaxy s24 and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Top Premium Smartphones : 2024లో.. బెస్ట్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ ఇదే..!

Top premium smartphones : 2024లో.. బెస్ట్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ ఇదే..!

Sharath Chitturi HT Telugu
Jan 29, 2024 12:50 PM IST

Premium smartphones in India : ప్రీమియం స్మార్ట్​ఫోన్​ కొనాలని భావిస్తున్నారా? అయితే.. ఈ లిస్ట్​ మీకు ఉపయోగపడుతుంది. టాప్​ స్మార్ట్​ఫోన్స్​ వివరాలు ఇవే..

2024లో.. బెస్ట్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ ఇదే..!
2024లో.. బెస్ట్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ ఇదే..!

Top Premium smartphones to buy : ఓ మంచి ప్రీమియం స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? మార్కెట్​లో ఉన్న ఆప్షన్స్​ చూసి కన్ఫ్యూజ్​ అవుతున్నారా? కంగారు పడకండి! ఇండియా గ్యాడ్జెట్స్​ మార్కెట్​లో.. టాప్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని మీకోసం మేము రూపొదించాము. ఆ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి.

టాప్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్స్​..

సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 అల్ట్రా:- ఈ సామ్​సంగ్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్​లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.7 ఇంచ్​- 6.8 ఇంచ్​ క్యూహెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. ఎస్​ పెన్​ కూడా లభిస్తోంది. ఎస్​24 అల్ట్రాలో టిటానియం ఫ్రేమ్​ ఉంటుంది. 200ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ టెలిఫొటో, 10ఎంపీ టెలిఫొటో, 12ఎంపీ అల్ట్రా వైడ్​తో కూడిన క్వాడ్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. 12ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది. 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఇందులో అనేక సూపర్​ ఏఐ ఫీచర్స్​ కూడా ఉన్నాయి. ఈ మొబైల్​ ధర రూ. 1,39,999గా ఉంది.

Apple iPhone 15 pro max price : యాపిల్​ ఐఫోన్​ 15 ప్రో మ్యాక్స్​:- ఈ యాపిల్​ స్మార్ట్​ఫోన్​లో 6.7 ఇంచ్​ స్క్రీన్​ ఉంటుంది. 48ఎంపీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా దీని సొంతం. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 12ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది. ఇందులో.. యాపిల్​ ఏ17 ప్రో చిప్​సెట్​ ఉంటుంది. 4,441 ఎంఏహెచ్​ బ్యాటరీ, 15వాట్​ వయర్​లెస్​, 4.5వాట్​ రివర్స్​ వయర్డ్​ ఛార్జర్​ సపోర్ట్​ లభిస్తోంది. ఈ మోడల్​ ప్రారంభ ధర రూ. 1,56,900గా ఉంది.

గూగుల్​ పిక్సెల్​ 8 ప్రో:- ఇందులో 6.7 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. కార్నరింగ్​ గొరిల్లా గ్లాస్​ విక్టస్​ 2 ప్రొటెక్షన్​ లభిస్తోంది. ఆండ్రాయిడ్​ 14పై ఈ మొబైల్​ పనిచేస్తుంది. 50ఎంపీ ప్రైమరీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ దీని సొంతం. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 10.5 ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది. గూగుల్​ టెన్సార్​ జీ3 ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. 5050 ఎంఏహెచ్​ బ్యాటరీ, 30వాట్​ వయర్డ్​, 23వాట్​ వయర్​లెస్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తోంది. ఈ గ్యాడ్జెట్​ ప్రారంభ ధర రూ. 1,06,999గా ఉంది.

OnePlus 12 price in India : వన్​ప్లస్​ 12:- వన్​ప్లస్​ 12లో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 చిప్​సెట్​ ఉంది. 120 హెజ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.82 ఇంచ్​ కర్వ్​డ్​ ఓఎల్​ఈడీ డిస్​ప్లే వస్తోంది. 50ఎంపీ ప్రైమరీ, 64ఎంపీ సెకెండరీ, 48ఎంపీ అల్ట్రావైడ్​ సెన్సార్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది. 5,400ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు 100 వాట్​ వయర్డ్​- 50వాట్​ వయర్​లెస్ ఛార్జింగ్​ సపోర్ట్​ ఉంటుంది. వన్​ప్లస్​ 12 ప్రారంభ ధర రూ. 64,999గా ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం