Tech layoffs 2024: ఐటీ ఉద్యోగులకు 2024 లో పీడ కలలేనా..?-tech layoffs 2024 flipkart amazon paytm google cut thousands of jobs ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tech Layoffs 2024: ఐటీ ఉద్యోగులకు 2024 లో పీడ కలలేనా..?

Tech layoffs 2024: ఐటీ ఉద్యోగులకు 2024 లో పీడ కలలేనా..?

HT Telugu Desk HT Telugu
Jan 12, 2024 03:40 PM IST

Tech layoffs 2024: 2024లో గూగుల్, మైక్రోసాఫ్ట్, డిస్కార్డ్ వంటి పెద్ద టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించే కార్యక్రమం చేపట్టాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Freepik)

Tech layoffs 2024: అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫ్లిప్‌కార్ట్ వంటి బహుళ జాతి టెక్ కంపెనీలు 2024 లో భారీ లే ఆఫ్స్ (layoff) కు తెర తీశాయి. కొత్త సంవత్సరం మొదటి రెండు వారాల్లో అనేక విభాగాల్లో వేలాది ఉద్యోగాలను తగ్గించాయి. దాంతో, ప్రస్తుతం ఐటీ మార్కెట్ లో ఉద్యోగాలు చేస్తున్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

హ్యూమేన్ ఏఐలో కూడా..

వాయిస్ అసిస్టెంట్, హార్డ్‌వేర్ విభాగాల్లో వందలాది ఉద్యోగాలను తగ్గించాలని గూగుల్ నిర్ణయించింది. వాటిలో Fitbit సహ వ్యవస్థాపకులు జేమ్స్ పార్క్, ఎరిక్ ఫ్రైడ్‌మాన్‌లు కూడా ఉండడం విశేషం. ఇంకా, మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘‘హ్యూమేన్ ఏఐ (HumaneAI)’’ తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో నాలుగు శాతం మందిని తొలగించాలని నిర్ణయించుకుంది. సంస్థ మొదటి ప్రొడక్ట్ అయిన వాయిస్-కంట్రోల్ హ్యాండ్స్‌ఫ్రీ AI పిన్‌ను ప్రారంభించడానికి ముందే హ్యూమేన్ ఏఐ (HumaneAI) ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

పేటీఎంలో భారీ తొలగింపులు

ఉద్యోగులను తొలగించబోతున్నామని 2024 లో మొదట ప్రకటించిన భారతీయ కంపెనీ పేటీఎం (Paytm). ఈ రెండు వారాల్లో ఈ సంస్థ దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది సంస్థ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పే టీఎం చెబుతోంది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల్లో..

ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కూడా లే ఆఫ్ ప్రక్రియ ప్రారంభించింది. తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 5-7 శాతం మందిని తొలగించే యోచనలో ఫ్లిప్ కార్ట్ ఉంది. కంపెనీ ఆర్థిక పనితీరు మందగించిన కారణంగా ఈ తొలగింపులు అనివార్యమయ్యాయని కంపెనీ చెబుతోంది. ఆమెజాన్ (amazon) తన ప్రైమ్ డివిజన్ నుండి వందలాది మందిని తొలగించాలని భావిస్తోంది.వారిలో ఎక్కువగా కస్టమర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న భారతీయ రిమోట్ కార్మికులు కావచ్చు.

గూగుల్ లో..

గూగుల్ (google) తన వాయిస్ అసిస్టెంట్, ఇంజినీరింగ్, హార్డ్‌వేర్ విభాగంలో ఉద్యోగాల కోత విధించనున్నట్లు బుధవారం ప్రకటించింది. Pixel, Nest ల నుండి వందల మందిని తొలగించింది. వీరిలో దాదాపుగా Fitbit సిబ్బంది మొత్తం ఉన్నారు.

నిజమైన విలన్ కృత్రిమ మేథ యేనా?

ప్రస్తుత లే ఆఫ్ సీజన్ కు కారణం గత దశాబ్దంలో జాబ్ మార్కెట్ బూగీమ్యాన్‌గా పేరుగాంచిన కృత్రిమ మేథ (AI) యేనని భావిస్తున్నారు.ఇప్పుడు ఐటీ, టెక్ దిగ్గజ కంపెనీలలో ఎక్కువ శాతం ఉద్యోగాల కోత AI పురోగతి కారణంగానే అన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు, ద్రవ్యోల్బణం పెద్ద కంపెనీల లాభాలను తినేస్తోంది. దాంతో, చివరి ప్రయత్నంగా, ఉద్యోగుల్లో కొంతమందిని తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.

WhatsApp channel