Tata Motors car sales : కార్​ సేల్స్​లో అదరగొట్టిన ఎం అండ్​ ఎం.. టాటా మోటార్స్​ కూడా!-tata motors total car sales rise 18 percent to 81 069 units in january ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Motors Car Sales : కార్​ సేల్స్​లో అదరగొట్టిన ఎం అండ్​ ఎం.. టాటా మోటార్స్​ కూడా!

Tata Motors car sales : కార్​ సేల్స్​లో అదరగొట్టిన ఎం అండ్​ ఎం.. టాటా మోటార్స్​ కూడా!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Feb 01, 2023 05:51 PM IST

Tata Motors car sales in January: టాటా మోటార్స్​, మహీంద్రా అండ్​ మహీంద్రా జనవరి కార్​ సేల్స్​ డేటాలు విడుదలయ్యాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

టాటా మోటార్స్​, మహీంద్రా అండ్​ మహీంద్రా కార్​ సేల్స్​ ఎలా ఉన్నాయంటే..
టాటా మోటార్స్​, మహీంద్రా అండ్​ మహీంద్రా కార్​ సేల్స్​ ఎలా ఉన్నాయంటే..

Tata Motors car sales in January : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​.. జనవరి నెలకు సంబంధించిన వాహనాల విక్రయాల డేటాను బుధవారం విడుదల చేసింది. 2023 తొలి నెలలో మొత్తం మీద 48,289 ప్యాసింజర్​ వాహనాలను విక్రయించింది టాటా మోటార్స్​. గతేడాది ఇదే నెల (40,942)తో పోల్చుకుంటే అది 18శాతం ఎక్కువగా ఉంది.

తాజాగా విడుదల చేసిన డేటాలో.. టాటా మోటార్స్​కు సంబంధించిన డొమెస్టిక్​, ఇంటర్నేషనల్​ ప్యాసింజర్​ వెహికిల్స్​తో పాటు ఎలక్ట్రిక వాహనాల నెంబర్లు కూడా ఉన్నాయి.

Tata Motors car sales data : డొమెస్టిక్​ మార్కెట్​లో జనవరిలో 47,987 యూనిట్​ను సేల్​ చేసింది టాటా మోటార్స్​. ఎలక్ట్రిక్​ కార్లు కూడా వీటిల్లో భాగమే. గతేడాది ఇదే సమయంలో డొమెస్టిక్​ వాహనాల విక్రయాల సంఖ్య 40,777గా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్​లోకి గత నెలలో 302 యూనిట్​లను ఎగుమతి చేసింది టాటా మోటార్స్​. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 165 యూనిట్​లుగా ఉంది. అంతే 83శాతం వృద్ధిని సాధించినట్టు!

Tata Motors price hike : టాటా మోటార్స్​ వాహనాల ధరలు పెరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్.. డొమెస్టిక్​- ఇంటర్నేషనల్​ నెంబర్లను కలుపుకుని, మొత్తం మీద సేల్స్​ 39శాతం వృద్ధిచెందింది. 2023 జనవరిలో 4,133 ఈవీలను సేల్​ చేసినట్టు దిగ్గజ ఆటో సంస్థ వెల్లడించింది. గతేడాది జనవరిలో ఈ సంఖ్య 2,982 యూనిట్​లుగా ఉంది.

మహీంద్రా అండ్​ మహీంద్రా..

Mahindra and Mahindra car sales : మరో దిగ్గజ ఆటో సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా దుమ్మురేపింది! జనవరి నెలలో 64,335 యూనిట్​లను విక్రయించింది. ఒక్క యుటిలిటీ వెహికిల్​ సెగ్మెంట్​లో 32,915 ఎస్​యూవీలను విక్రయించింది ఎం ఆండ్​ ఎం. గతేడాది ఇదే సమయంతో (19,848) పోల్చుకుంటే ఇది 66శాతం వృద్ధిచెందినట్టు! క్రాష్​ సెన్సార్​ సప్లై చెయిన్​లో ఇబ్బందులు, సెమీకండక్టర్​ల కొరత వంటి సమస్యలు వెంటాడుతున్నా.. ఈ స్థాయిలో వెహికిల్స్​ అమ్ముడుపోవడం విశేషం.

Kia Motors January sales పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

కమర్షియల్​ వెహికిల్​ సెగ్మెంట్​లో 21,724 వాహనాలను విక్రయించింది. ప్యాసింజర్​ వెహికిల్​ సెగ్మెంట్​లో 33,040 యూనిట్​లను సేల్​ చేసింది. ఇక విదేశాలకు 3009 యూనిట్​లను ఎగుమతి చేసింది ఈ ఆటో సంస్థ. గతేడాది ఈ సంఖ్య 2,865గా ఉంది.

"థార్​ ఆర్​డబ్ల్యూడీ, ఎక్స్​యూవీ400 వంటి లాంచ్​లు విజయవంతమయ్యాయి. 2023 తొలి నెలలో కస్టమర్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్​ వచ్చింది. యుటిలిటీ వెహికిల్​ సెగ్మెంట్​లో 66శాతం వృద్ధి నమోదుకావడం విశేషం," అని మహీంద్రా అండ్​ మహీంద్రా ఆటోమోటివ్​ డివిజన్​ ప్రెసిడెంట్​ వీజయ్​ నక్రా తెలిపారు.