Stocks to buy today : స్టాక్స్ టు బై- ఈ రూ. 125 బ్రేకౌట్ స్టాక్‌తో లాభాల ఛాన్స్ అధికం!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు..
ఇజ్రాయల్- ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు, చైనా మార్కెట్లో కొనుగోళ్లు జోరు కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా కరెక్షన్‌ని చూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 638 పాయింట్లు పడి 81,050 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 219 పాయింట్లు కోల్పోయి 24,796 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 9893 పాయింట్లు పతనమై 50,479 వద్దకు చేరింది.
“స్టాక్ మార్కెట్లో నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. నిఫ్టీ50 బలహీనంగా ఉంది. 24,500- 24,400 వద్ద సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే నిఫ్టీ50లో మరింత డౌన్‌ట్రెండ్ కనిపించొచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 8293.41 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 13245.12 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
అక్టోబర్‌లో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు ఏకంగా రూ. 39012.98 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 39673.71 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 130 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. డౌ జోన్స్ 0.94శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.96శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ ఏకంగా 1.18 పతనమైంది.
దాదాపు వారం రోజుల హాలీడే తర్వాత తెరుచుకున్న చైనా స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగాయి.
స్టాక్స్ టు బై..
జిల్లెట్ ఇండియా:- బై రూ. 8683.5, స్టాప్ లాస్ రూ. 8423, టార్గెట్ రూ. 9205
ఆర్ఆర్ కబేల్ లిమిటెడ్:- బై రూ. 1772.3 స్టాప్ లాస్ రూ. 1719, టార్గెట్ రూ. 1878
ఇన్ఫోసిస్:- బై రూ. 1930, స్టాప్ లాస్ రూ. 1880, టార్గెట్ రూ. 2030
అప్పోలో హాస్పిటల్:- బై రూ. 6773, స్టాప్ లాస్ రూ. 6700, టార్గెట్ రూ. 6950
ఎం అండ్ ఎం:- బై రూ. 3060, స్టాప్ లాస్ రూ. 3000, టార్గెట్ రూ. 3140
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఔసోమ్ ఎంటర్ప్రైజ్: రూ.134.24 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.144, స్టాప్ లాస్ రూ.129.90;
డీబీ కార్ప్: రూ.361.15 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.380, స్టాప్ లాస్ రూ.347;
సూరత్వాలా బిజినెస్ గ్రూప్: రూ.124.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.132, స్టాప్ లాస్ రూ.119.90;
ఆస్ట్రాజెనెకా ఫార్మా: రూ.7845.55 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.8333, స్టాప్ లాస్ రూ.7555; మరియు
హైటెక్ పైప్స్: రూ .198.84 వద్ద కొనండి, టార్గెట్ రూ .212, స్టాప్ లాస్ రూ .191.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం