Stocks to buy today : స్టాక్స్ టు బై.. ఈ రూ. 140 బ్రేకౌట్ స్టాక్ ట్రాక్ చేయండి!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. బ్రేకౌట్ స్టాక్స్, ఇంట్రాడే స్టాక్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Stocks to buy today : స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం సెలవు. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 79,106 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 5 పాయింట్లు పెరిగి 24,144 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 105 పాయింట్లు కోల్పోయి 49,727 వద్దకు చేరింది.
నిఫ్టీ 23,900 నుంచి 24,400 శ్రేణిలో ట్రేడవుతోందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా తెలిపారు. 50 స్టాక్ ఇండెక్స్‌కు తక్షణ మద్దతు 24,000 వద్ద ఉండగా, మార్కెట్ పక్షపాతాన్ని మెరుగుపరచడానికి ఫ్రంట్ లైన్ ఇండెక్స్ 24,250 పైన కొనసాగాలి. నిఫ్టీ50 ఇండెక్స్ 23,900 పైన ట్రేడ్ అయ్యేంత కాలం మొత్తం ట్రెండ్ సానుకూలంగా ఉందని ఛాయిస్ బ్రోకింగ్ నిపుణుడు తెలిపారు
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,595.27 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,236.21 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 29743.43 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 31453.91 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా మాంద్యం భయాలను పటాపంచలు చేస్తూ యూఎస్ సీపీఐ డేటా, జాబ్‌లెస్ క్లెయిమ్స్ డేటా పాజిటివ్‌గా వచ్చాయి. ఫలితంగా గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 1.39శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.61శాతం వృద్ధిచెందింది. నాస్డాక్ 2.34శాతం మేర లాభాలను చూసింది.
స్టాక్స్ టు బై..
జిందాల్ స్టీల్: రూ.929.75 వద్ద కొనండి, టార్గెట్ రూ.975, స్టాప్ లాస్ రూ.908
హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ ప్లోరేషన్ కంపెనీ: రూ.251.75 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.268, స్టాప్ లాస్ రూ.245
ఎవరెస్ట్ కాంటో సిలిండర్: రూ .167.30 వద్ద కొనండి, టార్గెట్ రూ .175, స్టాప్ నష్టం రూ .163
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ఈపీఎల్: రూ.243.80 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.264, స్టాప్ లాస్ రూ.234
ఔరమ్ ప్రాప్టెక్: రూ.210.30 వద్ద కొనండి, టార్గెట్ రూ.227, స్టాప్ లాస్ రూ.202
టైమ్ టెక్నోప్లాస్ట్: రూ .382.50 వద్ద కొనండి, టార్గెట్ రూ .415, స్టాప్ లాస్ రూ .367
కృతి న్యూట్రియెంట్స్: రూ.142.75, టార్గెట్ రూ.155, స్టాప్ లాస్ రూ.137
ఎస్హెచ్కే: రూ.215.15 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.233, స్టాప్ లాస్ రూ.207
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం
టాపిక్