Most Disliked Movie Trailer On Youtube: ఆడియెన్స్‌కు నచ్చితే సినిమాను ఎక్కడికో తీసుకొని వెళ్తారు. అదే నచ్చకుంటే మాత్రం అదే మూవీని పాతాళంలోకి తొక్కేస్తారు. అలా ప్రేక్షకుల నుంచి విపరీతమైన ద్వేషాన్ని మూటగట్టుకున్న సినిమాపై ఇక్కడ తెలుసుకుందాం.
యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే సుమారు 7 మిలియన్ (70 లక్షలు) డిస్‌లైక్స్ సాధించిన సినిమాగా బాలీవుడ్ మూవీ సడక్ 2 నిలిచింది. సాధాణంగా ఎక్కువ లైక్స్, వ్యూస్ వచ్చిన సినిమాలు రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి. కానీ, సడక్ 2 మూవీ మాత్రం అత్యంత ఎక్కువ డిస్‌లైక్స్ తెచ్చుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది.
స్టార్ హీరో హీరోయిన్స్ ఉన్నప్పటికీ కంటెంట్‌లో మ్యాటర్ లేకపోతే డిజాస్టర్‌గా నిలుస్తుందని కూడా సడక్ 2 నిరూపించింది. 1991లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా సడక్ రికార్డ్ క్రియేట్ చేస్తే దానికి సీక్వెల్‌గా 20 ఏళ్లకు వచ్చిన సడక్ 2 అత్యంత చెత్త భారతీయ చిత్రంగా నిలిచింది.
సడక్ 2 మూవీలో సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, ఆర్ఆర్ఆర్ ఫేమ్ అలియా భట్ మెయిన్ లీడ్ రోల్స్ ప్లే చేయగా.. మకరంద్ దేశ్ పాండే, పూజా భట్, ప్రియాంక బోస్, గుల్షన్ గ్రోవర్, జిషు సేన్ గుప్తా వంటి స్టార్ యాక్టర్స్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అలియా భట్ తండ్రి మహేష్ భట్ దర్శకత్వం వహించారు.
సడక్ మూవీని డైరెక్ట్ చేసిన మహేష్ భట్ చాలా కాలం గ్యాప్ తర్వాత సడక్ 2తో మెగా ఫోన్ పట్టుకున్నాడు. అలాగే, ముఖేష్ భట్‌తో కలిసి స్వీయ నిర్మాణం చేశాడు. 2020 ఆగస్ట్ 12న సడక్ 2 ట్రైలర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. దానికి 24 గంటల్లోనే 70 లక్షల డిస్‌లైక్స్ వచ్చి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత మొత్తంగా ఈ సినిమా ట్రైలర్‌ను 13.66 మిలియన్స్ అంటే, కోటి 36 లక్షల మంది మెచ్చలేదు.
అలా అత్యంత డిస్‌లైక్‌డ్ మూవీగా సడక్ 2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక కరోనా సమయం కావడంతో డైరెక్ట్‌గా ఓటీటీలో సడక్ 2ను రిలీజ్ చేశారు. 2020 ఆగస్ట్ 28 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సడక్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా సడక్ 2పై విమర్శలు, నెగెటివిటీ తలెత్తింది.
అంతేకాకుండా, ఐఎమ్‌డీబీ నుంచి సడక్ 2 మూవీకి పదికి 1.2 రేటింగ్ వచ్చింది. ఇంత చెత్త రేటింగ్ అందుకున్న ఏకైక భారతీయ చిత్రంగా కూడా సడక్ 2 రికార్డ్ క్రియేట్ చేసింది. అలా, ఓటీటీ రిలీజ్ అయిన రెండు రోజులకే వంద అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా సడక్ 2 చేరింది. అయితే, సడక్ 2పై ఆడియెన్స్ అంత ద్వేషం పెంచుకోడానికి ముఖ్య కారణం నెపోటిజం.
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెపోటిజంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. బాలీవుడ్ పెద్దలు, వారి పిల్లల కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా సుశాంత్‌కు అవకాశాలు దక్కకుండా చేశారని, ఇలాంటి అనేక కారణాలతో మానసికంగా కుంగిపోయిన సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని నెటిజన్స్, ఆడియెన్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అంతేకాకుండా సడక్ 2ని బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ కూడా చేశారు.
నెపోటిజం ఒక కారణం అయితే మరో కారణం హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతినడం. సడక్ 2లో హిందూ మతస్థులను విలన్స్‌గా, నెగెటివ్‌గా చూపించారని తప్పు బట్టారు. ఇలా ఎన్నో కారణాలతో మోస్ట్ డిస్‌లైక్‌డ్ ఇండియన్ మూవీగా సడక్ 2 నిలిచింది. అయితే, ప్రస్తుతం యూట్యూబ్‌లో సడక్ 2కు వచ్చిన 13 మిలియన్ల డిస్‌లైక్స్ కనిపించకపోవడం గమనార్హం.
టాపిక్