పురుషులలో వీర్యకణాలు తక్కువగా ఉన్న వారికి హ్యుమన్ కొరియానిక్ డ్రగ్స్ పనిచేస్తాయి. పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చే హార్మోనుల ఉత్పత్తిని సరిచేయడానికి ఈ మందులు వినియోగిస్తారు.
By Bolleddu Sarath Chandra Dec 25, 2024
Hindustan Times Telugu
పిట్యూటరీ గ్రంథి పనితీరును సరి చేయడానికి వాడే ఔషధాలతో పురుషులలో వీర్య కణాల ఉత్పత్తి మెరుగు పడుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది.
పురుషుల్లో హార్మోనుల వల్ల సంతానం లేకపోతే టెస్టోస్టిరాన్, గొనాడో ట్రోఫిన్ హార్మోనుల్ని కృత్రిమంగా ఇంజెక్షన్ల ద్వారా ఇవ్వడం ద్వారా లోపాన్ని సరిచేస్తారు.
పురుషుల్లో వీర్య కణాలు ప్రయాణించే మార్గంలో అవరోధాలు ఉంటే వాటిని సరిచేయడం ద్వారా సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడతాయి.
పుట్టుకతోనే కొందరిలో జననేంద్రియ వ్యవస్థలో లోపాల వల్ల వీర్య కణాల ప్రయాణం చేసే దారిలో అవరోధం ఏర్పడి వంధ్యత్వానికి దారి తీయొచ్చు. ఇలాంటి అవరోధాలను శస్త్ర చికిత్సలతో సరిచేయవచ్చు.
వీర్యకణాలు ప్రయాణించే మార్గంలో ఎపిడైడిమిస్ అవరోధాలు ఉంటే వాసో ఎపిడిడిమాస్టిమీ అనే మైక్రో సర్జరీతో సరిచేస్తారు
భర్త నుంచి వీర్య కణాలను సేకరించి భార్య గర్భ సంచిలో ప్రవేశపెట్టే పద్దతిని ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్ ఆఫ్ హస్బెండ్ అంటారు.
దాత నుంచి సేకరించిన వీర్యాన్ని భార్య గర్బసంచిలో ప్రవేశపెట్టే పద్దతిని ఆర్టిపిషియల్ ఇన్‌సెమినేషన్ ఆప్ డోనర్ అంటారు.
ఈ తరహా పద్ధతుల్లో గర్భదారణ చేయడాన్ని కృత్రిమ పద్దతులుగా పరిగణిస్తారు.
పురుషుల వృషణాల్లో క్షయ వ్యాధి వచ్చినా, ఫైలేరియా వ్యాధి సంక్రమించినా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి.
అతి కొద్ది మందిలో మాత్రమే హార్మోన్ టెస్టులు అవసరం అవుతాయి. ఫాలికులార్ స్టిములేటింగ్ హార్మోన్, ల్యూటీనైజింగ్్ హార్మోన్, టెస్టోస్టిరాన్; ప్రొలేక్టిన్ హార్మోనుల పనితీరును పరిశీలించి తగిన చికిత్స అందిస్తారు.
వీర్యం వచ్చే మార్గం మూసుకుపోయినా, చిన్నతనంలో గవద బిళ్లలు వచ్చి దాని వల్ల వృషణాలు దెబ్బతిన్నా వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుంది. కొలిమి వంటి వేడి ప్రదేశాల్లో పనిచేసే వారిలో స్థూలకాయుల్లో హార్మోనులు సరిగా తయారు కాక వంధ్యత్వం రావొచ్చు.
పురుషుల్లో వంధ్యత్వానికి కారణమయ్యే సమస్యలను అధిగమించడానికి అనేక రకాల శాస్త్రీయ చికిత్సలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.