Stock market news: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 170 అప్-stock market news today 9th november 2022 in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market News: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 170 అప్

Stock market news: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 170 అప్

Praveen Kumar Lenkala HT Telugu
Nov 09, 2022 09:17 AM IST

Stock market news: స్టాక్ మార్కెట్లు బుధవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి.

సోమవారం లాభపడిన స్టాక్ ఎక్స్ఛేంజీలు
సోమవారం లాభపడిన స్టాక్ ఎక్స్ఛేంజీలు (MINT_PRINT)

Stock market news: స్టాక్ మార్కెట్లు బుధవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 173 పాయింట్లు లాభపడి 61,358 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 57.20 పాయింట్లు లాభపడి 18,260 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Top gainer stocks: టాప్ గెయినర్స్ జాబితా ఇదే

టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, మారుతీ సుజుకీ, ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్ తదితర స్టాక్స్ ఉన్నాయి.

Top loser stocks: టాప్ లూజర్స్ జాబితా ఇదే

టాప్ లూజర్స్ జాబితాలో టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర స్టాక్స్ ఉన్నాయి.

Pre-market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 119.14 పాయింట్లు బలపడి 61,304 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 85.45 పాయింట్లు బలపడి 18,288 పాయింట్ల వద్ద స్థిరపడింది. కాగా నిన్న మంగళవారం గురునానక్ జయంతి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు సెలవు. ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ సోమవారం 230 పాయింట్లకు పైగా ఎగబాకి 61,000 మార్కును తిరిగి పొందింది. గ్లోబల్ ఈక్విటీలలో స్థిరమైన ధోరణి మధ్య బ్యాంక్, ఆటో, మెటల్ స్టాక్‌లలో బలమైన కొనుగోళ్ల కారణంగా సూచీలు లాభపడ్డాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం, విదేశీ మూలధన ప్రవాహం స్థిరంగా ఉండటం కూడా దేశీయ ఈక్విటీలకు మద్దతునిచ్చిందని ట్రేడర్లు తెలిపారు. సెన్సెక్స్ అస్థిరమైన సెషన్ తర్వాత 234.79 పాయింట్లు (0.39 శాతం) పెరిగి 61,185.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 85.65 పాయింట్లు (0.47 శాతం) పెరిగి 18,202.80 పాయింట్ల వద్ద ముగిసింది.

విదేశాల్లో బలహీనమైన గ్రీన్‌బ్యాక్, నిరంతర విదేశీ నిధుల ప్రవాహం మధ్య సోమవారం అమెరికా డాలర్‌తో రూపాయి 43 పైసలు పెరిగి 81.92 వద్ద ముగిసింది. 

Whats_app_banner