PURE EV IPO : ప్రభుత్వ సబ్సిడీ లేకుండానే లాభాల్లో ‘ప్యూర్​ ఈవీ’- ఇప్పుడు ఐపీఓ ప్లాన్స్​-pure ev plans for major ipo fuelled by motorcycles growth story and strong fundamentals ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Pure Ev Ipo : ప్రభుత్వ సబ్సిడీ లేకుండానే లాభాల్లో ‘ప్యూర్​ ఈవీ’- ఇప్పుడు ఐపీఓ ప్లాన్స్​

PURE EV IPO : ప్రభుత్వ సబ్సిడీ లేకుండానే లాభాల్లో ‘ప్యూర్​ ఈవీ’- ఇప్పుడు ఐపీఓ ప్లాన్స్​

Sharath Chitturi HT Telugu
Sep 01, 2024 12:16 PM IST

PURE EV IPO : ప్రముఖ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ ప్యూర్​ ఈవీ, ఐపీఓకి ప్లాన్​ చేస్తోంది. ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీలు లేకుండానే 3ఏళ్లుగా లాభాల్లో ఉన్న ఈ సంస్థకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ప్యూర్​ ఈవీ ఐపీఓ..
ప్యూర్​ ఈవీ ఐపీఓ..

2వాట్​ ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​లో లీడింగ్​ ప్లేయర్​గా కొనసాగుతున్న ప్యూర్​ ఈవీ ఐపీఓ (ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫరింగ్​)కి శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ఎఫ్​వై25లో ఐపీఓ ద్వారా మార్కెట్​లోకి అడుగుపెట్టేందుకు ప్యూర్​ ఈవీ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ వివరాలు, ఐపీఓ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ప్యూర్​ ఈవీ ఐపీఓ..

ఐఐటీ బాంబే అలుమ్నీ నిశాంత్​ దంగోరి, రోహిత్​ వడేరలు 2019లో ఐఐటీ హైదరాబాద్​లో ప్యూర్​ ఈవీ సంస్థను స్థాపించారు. వీరికి ఇంజినీరింగ్​, మేన్యుఫ్యాక్టరింగ్​లో 30ఏళ్ల ఎక్స్​పీరియెన్స్​ ఉంది. ఈ సంస్థలో ఐ-టెక్​ ఐఐటీ హైదరాబాద్​, నాట్​కో ఫార్మా ఫ్యామిలీ ఆఫీస్​, లారస్​ ల్యాబ్స్​ ఫ్యామిలీ ఆఫీస్​, హెచ్​టీ వెంచర్స్​, బీసీసీఎల్​, యూఈపీఎల్​ వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.

ఈ కంపెనీ పోర్ట్​ఫోలియోలో 201 కి.మీల రేంజ్​ ఇచ్చే ఈప్లూటో 7జీ మ్యాక్స్​, ఎంట్రెన్స్​ నియో+, ఈటైరిస్ట్​ ఎక్స్​, ఈకోడ్రిఫ్ట్​ వంటి మోడల్స్​ ఉన్నాయి. వీటిని ఏఐ ఆధారిత ఎక్స్​-ప్లాట్​ఫామ్​పై రూపొందించడంతో,ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో క్లౌడ్​ అలర్ట్స్​తో పాటు లాంగ్​ మైలేజ్​ వంటి అడ్వాన్స్​డ్​ డ్రైవింగ్​ ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

ప్యూర్​ ఈవీ సంస్థ సైలెంట్​గా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 70వేలకుపైగా కస్టమర్లు, 65 డీలర్లు ఉన్నారు. ఈ కంపెనీ మోడల్స్ భారత రోడ్లపై​200 కోట్లకుపైగా కిలోమీటర్లు తిరిగాయి!

ప్యూర్​ ఈవీ ఐపీఓపై సంస్థ సీఈఓ రోహిత్​ వడేరా మాట్లాడారు.

"పవర్​ట్రైన్​కి బ్యాక్​వర్డ్​ ఇంటిగ్రేషన్​తో కూడిన ఇన్​-హైస్​​ బ్యాటరీ మేన్యుఫ్యాక్చరింగ్​ సెటప్​ ఉంది. ప్రభుత్వ సబ్సిడీపై ఆధారపడకుండా, గత మూడేళ్లుగా లాభాల్లో కొనసాగుతుండటానికి మా సంస్థ బలమైన ఫైనాన్షియల్​ ఫండమెంటల్స్​ కారణం. క్యాష్​ బర్న్​ లేకుంగా ఆర్గానిక్​ సేల్స్​ జరుగుతన్నాయి. బిజినెస్​ మోడల్​ వల్ల శక్తివంతమైన క్యాష్​ ఫ్లోలు ఉన్నాయి. రానున్న 5ఏళ్లల్లో 100 రెట్లు వృద్ధి చెందే సెగ్మెంట్​లో 2 ఎలక్ట్రిక్​ మోటార్​సైకిల్స్​ని లాంచ్​ చేయడంతో అతి తక్కువ సమయంలోనే నెం.2 స్థానాన్ని కైవశం చేసుకుంటాము. 4ఏళ్లల్లో కంపెనీ టర్నోవర్​ 20రెట్లు పెరుగుతందని అంచనా వేస్తున్నాము. స్కూటర్​, బైక్​ మోడల్స్​లో మాస్​ కమ్యూట్​ సెగ్మెంట్​ వృద్ధిపై మాకు నమ్మకం ఉంది," అని అన్నారు.

ఈ ప్యూర్​ ఈవీకి నిత్య ఇన్నోవేషన్​, ఆర్​ అండ్​ డీ కోసం ఐఐటీ హైదరాబాద్​తో దీర్ఘకాల ఒప్పందం ఉంది. ఎఫ్​వై26లో సాలిడ్​ స్టేట్​ బ్యాటరీ టెక్నాలజీని ఈ సంస్థ లాంచ్​ చేయనుంది. ఇందుకోసం యూకే ఆధారిత పీడీఎస్​ఎల్​ సంస్థతో ప్యూర్​ ఈవీ కలిసి పనిచేస్తోంది.

ప్యూర్​ ఈవీ ఫైనాన్షియల్​ ఔట్​లుక్​- గ్రోత్​ స్ట్రాటజీ..

ఈవీ 2వాట్​ సెగ్మెంట్​లో ప్యూర్​ ఈవీకి బలమైన, మెరుగైన ఆర్థిక ఫండమెంటల్స్​ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఫెమా సబ్సిడీ లేకుండానే పాజిటివ్​ క్యాష్​ ఫ్లోతో గత మూడేళ్లుగా సంస్థ ప్రాఫిట్స్​లో ఉంది. పైగా ఇందులో కంపెనీ ప్రమోటర్లకు 85శాతం వాటా ఉంది. అంతేకాదు వరుసగా రెండు సంవత్సరాల పాటు ఐసీఆర్​ఏ బీబీ+ రేటింగ్​ని పొందిన సంస్థ ప్యూర్​ ఈవీ.

నిధులు వేగంగా కరిగిపోకుండనే సేల్స్​ పరంగా సంస్థ ఆర్గానిక్​గా వృద్ధి చెందుతుండటం సానుకూల విషయం. బలమైన ప్యాట్​ నెంబర్లతో రానున్న నాలుగేళ్లల్లో ఈ సంస్థ రూ. 2వేల కోట్ల టర్నోవర్​ని సాధిస్తుందని విశ్వసిస్తోంది.

ఈవీ సెక్టార్​పై పెట్టుబడుల వర్షం..!

ఎక్సికమ్​ టెలీ- సిస్టెమ్స్​, ఓలా ఎలక్ట్రిక్​ ఐపీఓల సక్సెస్​, క్యాపిటల్​ మార్కెట్​లో ఒలెక్ట్రా గ్రీన్​ టెక్​ ప్రదర్శన వంటివి ఈవీ రంగంపై పెట్టుబడిదారుల్లో నమ్మకానికి నిదర్శనం! ఈ పాజిటివ్​ సెంటిమెంట్​తోనే 2వాట్​లో కీలక ప్లేయర్​ ఏథర్​ ఎనర్జీ కూడా లిస్టింగ్​కి సిద్ధమవుతోంది.

టెక్నాలజీలో పురోగతి, ప్రపంచవ్యాప్తంగా దిగొస్తున్న బ్యాటరీ ధరలు వంటివి ఈవీ సెగ్మెంట్​ వృద్ధికి కారణంగా మారనున్నాయి. ఈ పరిణామాలతో కస్టమర్లకు వైడ్​ రేంజ్​ పోర్ట్​ఫోలియో స్కూటర్లు, బైక్స్​ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.

బ్యాటరీ టెక్నాలజీలో కీలక ప్లేయర్​గాను, రెండు ఈ- బైక్స్​ని సిద్ధం చేస్తున్న సంస్థగా.. ఐసీఈ నుంచి ఈవీకి షిఫ్ట్​ అవుతున్న నేటి ప్రపంచంలో ప్యూర్​ ఈవీ కీలక పాత్ర పోషించనుంది. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను సంస్థ వృద్ధికి ఉపయోగించుకుంటే, 2 వీలర్​ ఈవీ సెగ్మెంట్​పై కంపెనీ పట్టు మరింత పెరుగుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం