Pure EV ePluto 7G pro : ఈప్లూటో 7జీ ప్రో- ఓలా ఎలక్ట్రిక్ కన్నా ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ!
Pure EV ePluto 7G pro : ప్యూర్ ఈవీ సంస్థ.. ఈప్లూటో 7జీ ప్రోను మార్కెట్లోకి దింపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్, రేంజ్, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Pure EV ePluto 7G pro : ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ సంస్థ ప్యూర్ ఈవీ.. 'ఈప్లూటో 7జీ ప్రో' స్కూటర్‌ను ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 94,999. ఇదొక టాప్ ఎండ్ మోడల్. మాట్ బ్లాక్, గ్రే, వైట్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ప్యూర్ ఈవీ డీలర్షిప్ షోరూమ్స్‌లో ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ నెల చివర్లో డెలివరీలను ప్రారంభిస్తామని సంస్థ చెప్పింది.
ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ ప్రో- ఫీచర్స్..
ఈకోడ్రిఫ్ట్ మోటార్‌సైకిల్ ప్లాట్ఫార్మ్పై ఈ స్కూటర్‌ను రూపొదించారు. 1.5కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్ ఇందులో ఉంటుంది. 2.4కేడబ్ల్యూ ఎంసీయూ, సీఏఎన్ ఆధారిత ఛార్జర్ ఉంటాయి. ఇందులో 3.0కేడబ్ల్యూహెచ్ ఏఐఎస్ 156 సర్టిఫైడ్ బ్యాటరీ లభిస్తుండటం విశేషం. స్మార్ట్ బీఎంఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ సైతం వస్తున్నాయి.
Pure EV ePluto 7G pro price : ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్.. 100-150 కి.మీల వరకు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. ఈవీలో ఉన్న మూడు మోడ్స్ బట్టి రేంజ్ మారుతుందని పేర్కొంది. నాలుగు వేరువేరు మైక్రోకంట్రోలర్స్, వివిధ సెన్సార్లతో స్మార్ట్‌ఫోన్ కన్నా ఎక్కువ ప్రాసెసింగ్.. ఈ స్కూటర్‌కు ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- EV Chargers: కస్టమర్లకు ఆ డబ్బును రీఫండ్ చేయనున్న ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్
"మా బెస్ట్ సెల్లింగ్ 7జీ మోడల్‌కు ఇది అప్‌గ్రేడెడ్ వర్షెన్. మా ఇన్నోవేషన్, సస్టైనబులిటీ, ఎక్సలెన్స్‌కు ఇది చిహ్నం. ప్రీలాంచ్‌కు ముందే ఈ ఈవీపై 5వేలమందికిపైగా ఆసక్తి చూపించారు. లాంచ్ అయిన 2వేలకుపైగా బుకింగ్స్ వస్తాయని ఆశిస్తున్నాము," అని ప్యూర్ ఈవీ కో-ఫౌండర్, సీఈఓ రోహిత్ వదేరా తెలిపారు.
గట్టి పోటీ తప్పదు..!
Pure EV ePluto 7G pro range : ప్యూర్ ఈవీలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. ఎఫ్వై24 ముగింపు నాటికి 300 టచ్పాయింట్స్ను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. ఒకినావా, అంపేరే, హీరో ఎలక్ట్రిక్‌కు ఈ ఈప్లూటో 7జీ ప్రో గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం