POCO X5 Pro vs Realme GT Neo 3T : ఈ రెండు 5జీ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?-poco x5 pro vs realme gt neo 3t check detailed comparison of features and price here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Poco X5 Pro Vs Realme Gt Neo 3t : ఈ రెండు 5జీ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

POCO X5 Pro vs Realme GT Neo 3T : ఈ రెండు 5జీ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
May 07, 2023 07:18 AM IST

POCO X5 Pro vs Realme GT Neo 3T : పోకో ఎక్స్​5 ప్రో 5జీ, రియల్​మీ జీటీ నియో 3టీ 5జీ ఫోన్స్​లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి..

ఈ రెండు 5జీ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​?
ఈ రెండు 5జీ స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? (HT Tech)

POCO X5 Pro vs Realme GT Neo 3T : ఇండియా 5జీ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో పోకో ఎక్స్​5 ప్రో, రియల్​మీ జీటీ నియో 3టీ గ్యాడ్జెట్స్​ టాప్​ సెల్లింగ్​ మోడల్స్​గా కొనసాగుతున్నాయి. మిడ్​ బడ్జెట్​ సెగ్మెంట్​లో దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

పోకో ఎక్స్​5 ప్రో వర్సెస్​ రియల్​మీ జీటీ నియో 3టీ- స్పెసిఫికేషన్స్​..

పోకో ఎక్స్​5 ప్రోలో టాప్​ సెంటర్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​, సైడ్​ మెంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​లు ఉన్నాయి. ఈ డివైజ్​కు ఐపీ53 స్ప్లాష్​ రెసిస్టెన్స్​ లభిస్తోంది.

POCO X5 Pro 5G features : రియల్​మీ గ్యాడ్జెట్​లో సెల్ఫీ కెమెరా కోసం లెఫ్ట్​ అలైన్డ్​ పంచ్​ హోల్​ వస్తోంది. ఫింగర్​ప్రింట్​ రెండర్​.. స్క్రీన్​ దిగువన ఉంటుంది.

పోకో ఎక్స్​5 ప్రోలో 6.67 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ (1080x2400 పిక్సెల్స్​) అమోలెడ్​ స్క్రీన్​ విత్​ డాల్బి విజన్​ ఉంటుంది. 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, గొరిల్లా గ్లాస్​ 5 లభిస్తున్నాయి.

Realme GT Neo 3T features : ఇక రియల్​మీ జీటీ నియో 3టీలో 6.62 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ (1080x2412 పిక్సెల్స్​) ఈ4 అమోలెడ్​ ప్యానెల్​ ఉంటుంది. 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​, గొరిల్లా గ్లాస్​ 5 లభిస్తున్నాయి.

ఇదీ చూడండి:- Vivo X90 Pro vs Xiaomi 13 Pro : వివో ఎక్స్​90 ప్రో వర్సెస్​ షావోమీ 13 ప్రో- ఏది బెస్ట్​?

పోకో ఎక్స్​5 ప్రో వర్సెస్​ రియల్​మీ జీటీ నియో 3టీ- ఫీచర్స్​..

పోకో ఎక్స్​5 ప్రోలో స్నాప్​డ్రాగన్​ 778జీ చిప్​సెట్​ ఉంది. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్​ ఆధారిత ఎంఐయూఐ 14 సాఫ్ట్​వేర్​ ఇందులో ఉంటుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం.

ఇక రియల్​మీ జీటీ నియో 3టీలో స్నాప్​డ్రాగన్​ 870 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ఉంది. 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్లు ఉన్నాయి. రియల్​మీ యూఐ 3.0 సాఫ్ట్​వేర్​పై ఇది పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం.

పోకో ఎక్స్​5 ప్రో వర్సెస్​ రియల్​మీ జీటీ నియో 3టీ- ధర..

POCO X5 Pro 5G price : పోకో ఎక్స్​5 ప్రో రెండు వేరియంట్ల ధరలు రూ. 22,999- రూ. 24,999. ఐసీఐసీఐ బ్యాంక్​ క్రెడిట్​ కార్డుపై రూ. 1,250 డిస్కౌంట్​ పొందవచ్చు.

Realme GT Neo 3T price : ఇక రియల్​మీ జీటీ నియో 3టీ రెండు వేరియంట్ల ధర రూ. 19,999- రూ. 21,999గా ఉంది. మొబీవిక్​లో రూ. 1000 క్యాష్​బ్యాక్​ పొందవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం