Vivo X90 Pro vs Xiaomi 13 Pro : వివో ఎక్స్​90 ప్రో వర్సెస్​ షావోమీ 13 ప్రో- ఏది బెస్ట్​?-vivo x90 pro vs xiaomi 13 pro which is better check detailed comparison of features prices and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vivo X90 Pro Vs Xiaomi 13 Pro : వివో ఎక్స్​90 ప్రో వర్సెస్​ షావోమీ 13 ప్రో- ఏది బెస్ట్​?

Vivo X90 Pro vs Xiaomi 13 Pro : వివో ఎక్స్​90 ప్రో వర్సెస్​ షావోమీ 13 ప్రో- ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Apr 30, 2023 07:18 AM IST

Vivo X90 Pro vs Xiaomi 13 Pro : వివో ఎక్స్​90 ప్రో వర్సెస్​ షావోమీ 13 ప్రో.. ఈ రెండిట్లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ ? ఇక్కడ తెలుసుకుందాము..

వివో ఎక్స్​90 ప్రో వర్సెస్​ షావోమీ 13 ప్రో.. ఏది బెస్ట్​?
వివో ఎక్స్​90 ప్రో వర్సెస్​ షావోమీ 13 ప్రో.. ఏది బెస్ట్​? (HT TECH)

Vivo X90 Pro vs Xiaomi 13 Pro : ఇండియా స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లోకి కొత్తగా అడుగుపెట్టింది వివో ఎక్స్​90 ప్రో. ఈ గ్యాడ్జెట్​.. షావోమీ 13 ప్రోకు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది కొంటే బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

వివో ఎక్స్​90 ప్రో వర్సెస్​ షావోమీ 13 ప్రో- స్పెసిఫికేషన్స్​..

వివో ఎక్స్​90 ప్రో, షావోమీ 13 ప్రోలో సెంట్రల్లీ- అలైన్డ్​ పంచ్​ హోల్​ కటౌట్​, ఐపీ68 రేటెడ్​ డస్ట్​ అండ్​ వాటర్​ రెసిస్టెన్స్​, కర్వ్​డ్​ ఎడ్జెస్​, ఇన్​- డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ సెన్సార్​లు లభిస్తున్నాయి.

Vivo X90 Pro price : వివో ఎక్స్​90 ప్రోకు స్కాట్​ ఎక్సెన్​సేషన్​ ప్రొటెక్షన్​ లభిస్తుండగా.. షావోమీ 13 ప్రో డిస్​ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్​ విక్టస్​ కవర్​ గ్లాసెస్​ వస్తున్నాయి.

వివో ఎక్స్​90 ప్రో వర్సెస్​ షావోమీ 13 ప్రో- ఫీచర్స్​..

Xiaomi 13 Pro price : వివో ఎక్స్​90 ప్రోలో 50ఎంపీ (ఓఐఎస్​) 1.0 ఇంచ్​ ఐఎంఎక్స్​989 ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రా- వైడ్​ షూటర్​, 50ఎంపీ పోట్రైట్​ స్నాపర్​లు ఉన్నాయి. షావోమ 13 ప్రోలో 50ఎంపీ 1.0 ఇంచ్​ ఐఎంఎక్స్​989 ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రా- వైడ్​, 50ఎంపీ టెలిఫొటో లెన్స్​లు ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లోనూ 32ఎంపీ కెమెరా లభిస్తోంది. ఈ రెండు గ్యాడ్జెట్స్​ కూడా రేర్​ కెమెరా సెటప్​తో 24ఎఫ్​పీఎస్​తో 8కే వీడియోలను షూట్​ చేయగలవు.

ఇదీ చదవండి:- Vivo X90 Pro vs Samsung S23 Ultra : వివో ఎక్స్​90 ప్రో వర్సెస్​ గ్యాలెక్సీ ఎస్​23 అల్ట్రా.. ఏది బెస్ట్​?

వివో ఎక్స్​90 ప్రోలో డైమెన్సిటీ 9200 చిప్​సెట్​ ఉండగా.. షావోమీ 13 ప్రోలో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ఎస్​ఓసీ ప్రాసెసర్​ లభిస్తోంది. ఈ రెండిట్లోనూ 12జీబీ ఎల్​పీడీడీఆర్​5ఎక్స్​ ర్యామ్​, 256జీబీ యూఎఫ్​ఎస్​ 4.0 స్టోరేజ్​ వస్తున్నాయి.

Vivo X90 Pro price in India : వివో గ్యాడ్జెట్​లో ఫన్​టచ్​ ఓఎస్​ 13తో కూడిన ఆండ్రాయిడ్​ 13 ఓఎస్​ వస్తుండగా.. షావోమీ డివైజ్​లో ఎంఐయూఐ 14తో కూడిన ఆండ్రాయిడ్​ 13 ఉంటుంది.

ఎక్స్​90 ప్రోలో 4,870 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండగా.. షావోమీ 13ప్రోలో 4,820ఎంఏహెచ్​ బ్యాటరీ వస్తోంది. ఈ రెండు గ్యాడ్జెట్స్​ 120డబ్ల్యూ వయర్డ్​, 50వాట్​/10వాట్​ వయర్​లెస్​, రివర్స్​ వయర్​లెస్​ ఛార్జింగ్​ను సపోర్ట్​ చేస్తున్నాయి.

వివో ఎక్స్​90 ప్రో వర్సెస్​ షావోమీ 13 ప్రో- ధర..

Vivo X90 Pro features list : వివో ఎక్స్​90 ప్రో ప్రీ బుకింగ్స్​ ప్రారంభమయయాయి. ధర రూ. 84,999. మే 5న సేల్​ మొదలవుతుంది. లెజెండరీ బ్లాక్​ రంగులో అందుబాటులో ఉంటుంది. హెచ్​డీఎఫ్​సీ/ఐసీఐసీఐ కార్డులపై రూ. 8వేల వరకు డిస్కౌంట్​ పొందవచ్చు.

Xiaomi 13 Pro price in India : ఇక షావోమీ 13ప్రో ధర రూ. 79,999. సెరామిక్​ బ్లాక్​, సెరామిక్​ వైట్​ రంగుల్లో అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్​ క్రెడిట్​ కార్డుపై రూ. 8వేల తగ్గింపు లభిస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం