Bluetooth speaker: సంగీతం, సినిమాలు లేదా వృత్తిపరమైన ఉపయోగం కోసం ఇప్పుడు చాలా మంది బ్లూటూత్ స్పీకర్ ను కొనుగోలు చేస్తున్నారు? అయితే, మన అవసరానికి అనుగుణమైన సరైన బ్లూ టూత్ స్పీకర్ ను ఎంచుకునేముందు కొంత రీసెర్చ్ చేయడం అవసరం. ఇప్పుడు మార్కెట్లో అనేక బ్లూటూత్ స్పీకర్ మోడల్స్ అందుబాటులో ఉన్నందున, సరైన మోడల్ ను ఎంపిక చేయడం సవాలుగా మారింది. బ్లూటూత్ స్పీకర్ ను సెలెక్ట్ చేసుకునేముందు ఈ కింది విషయాలు తెలుసుకోవాలి.
మన అవసరాలకు సరిపోయే బ్లూటూత్ స్పీకర్ ను ఎంచుకోవాలి.
సౌండ్ నాణ్యత వ్యక్తిగత ప్రాధాన్యతల ఆధారంగా మారుతుంది. బ్లూటూత్ స్పీకర్ ను కొనేముందు ఇవి చెక్ చేయండి.
స్పీకర్ ను సెలెక్ట్ చేసుకునే ముందు అది సపోర్ట్ చేసే కనెక్టివిటీ పద్ధతులను పరిశీలించండి.
మీ గది యొక్క పరిమాణం, అకౌస్టిక్స్ స్పీకర్ పనితీరును ప్రభావితం చేస్తాయి.
పైన పేర్కొన్న ఫీచర్స్ ఆధారంగా స్పీకర్ల ధరలు కూడా మారుతూ ఉంటాయి.
బ్లూటూత్ స్పీకర్ ను కొనుగోలు చేసేముందు ఆ స్పీకర్స్ ను అందిస్తున్న వివిధ బ్రాండ్స్ ను పరిశీలించండి. మీ డబ్బుకు సరైన విలువ అందించే బ్రాండ్ అండ్ మోడల్ ను ఎంచుకోండి. యూట్యూబ్ (youtube) లో, గూగుల్ (google) లో, వివిధ ఈ కామర్స్ సైట్స్ లో ఆయా మోడల్స్ బ్లూటూత్ స్పీకర్స్ పై వచ్చిన రివ్యూలను చదవండి. అందులో యూజర్ రివ్యూలు, స్పెషలిస్ట్ రివ్యూలు ఉంటాయి. రెండింటినీ పరిశీలించండి. మెరుగైన రేటింగ్ ఉన్న స్పీకర్లను పరిగణనలోకి తీసుకోండి.