ఎయిర్ కండిషనింగ్ ప్రమాణాలకు సంబంధించి త్వరలో కొత్త నిబంధనను అమలు చేయనున్నారు. వాటి ప్రకారం, భారత్ లో ఏసీల ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుంచి 28 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. బాధ్యతాయుతమైన శక్తి వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ చర్య లక్ష్యం.