Nokia G60 5G । నోకియా నుంచి మిడ్-రేంజ్ ఫోన్.. శాంసంగ్ ఫోన్‌కు దగ్గరి పోలికలు!-nokia g60 5g smartphone launched looks similar to samsung galaxy a53 5g in some aspects ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Nokia G60 5g Smartphone Launched Looks Similar To Samsung Galaxy A53 5g In Some Aspects

Nokia G60 5G । నోకియా నుంచి మిడ్-రేంజ్ ఫోన్.. శాంసంగ్ ఫోన్‌కు దగ్గరి పోలికలు!

HT Telugu Desk HT Telugu
Nov 01, 2022 07:28 PM IST

నోకియా నుంచి Nokia G60 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో విడుదలయింది. లాంచ్ ఆఫర్ లో భాగంగా Nokia Power Earbuds Lite ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే, వివరాలు చూడండి.

Nokia G60 5G
Nokia G60 5G

నోకియా బ్రాండ్ లైసెన్సీ కలిగి ఉన్న HDM గ్లోబల్, తాజాగా భారత మార్కెట్లో నోకియా G60 5G అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 5G కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ మెరుగైన రిఫ్రెర్ష్ రేట్ కలిగిన డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ మొదలైన ప్రీమియం ఫీచర్లతో వచ్చింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. అయితే కంపెనీ మూడేళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించనున్నట్లు పేర్కొంది.

Nokia G60 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM /128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఏకైక కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే మెమరీ కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని మరింత విస్తరించుకునే వీలుంది. ఈ ఫోన్ బ్లాక్, ఐస్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. Nokia G60 5G ఇప్పటికే అధికారిక నోకియా వెబ్‌సైట్, ఇంకా ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లలో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. నేటి నుండి నవంబర్ 7 వరకు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు, నవంబర్ 8 నుండి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్‌ను ముందస్తు బుకింగ్ చేసుకున్న కస్టమర్ల కోసం కంపెనీ రూ. 3,599 విలువ గల Nokia Power Earbuds Lite సెట్‌ను ఉచితంగాఅందిస్తోంది.

మరి ఈ కొత్త Nokia G60 5G స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత మొదలగు వివరాలు ఈ కింద చూడండి.

Nokia G60 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.58 అంగుళాల FHD+ డిస్‌ప్లే
  • 8GB RAM, 120 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP + 5MP +2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 20W ఛార్జర్

ఇతర కనెక్టివిటీ ఫీచర్లలో బ్లూటూత్ 5.1, 3.5 మిమీ జాక్, టైప్-సి పోర్ట్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై ఉన్నాయి.

Nokia G60 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 29,999/- గా ఉంది. అయితే ఇదే తరహా ఫీచర్లతో మార్కెట్లో Samsung Galaxy A53 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. దాని ధర ఈ నోకియా కంటే కొద్దిగా తక్కువగానే ఉంది. ఆ ఫోన్ ఎలా ఉందో క్లిక్ చేసి చెక్ చేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం