Nissan Magnite facelift : నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​- బుకింగ్స్​ షురూ..-nissan magnite facelift 2024 launch date revealed bookings opened check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nissan Magnite Facelift : నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​- బుకింగ్స్​ షురూ..

Nissan Magnite facelift : నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​- బుకింగ్స్​ షురూ..

Sharath Chitturi HT Telugu
Sep 30, 2024 06:40 AM IST

Nissan Magnite Facelift 2024 : నిస్సాన్ మాగ్నైట్ ఫేస్​లిఫ్ట్ బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి. ఈ ఎస్​యూవీ ఇంకొన్ని రోజుల్లో లాంచ్​కానుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్​లిఫ్ట్ వచ్చేస్తోంది..
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్​లిఫ్ట్ వచ్చేస్తోంది..

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటైన నిస్సాన్​ మాగ్నైట్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మోడల్​ లాంచ్​ డేట్​ రివీల్​ అయ్యింది. నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​ అక్టోబర్​ 4న అరంగేట్రం చేయనుంది. దీనికి సంబంధించి బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిస్సాన్​ డీలర్​షిప్​ షోరూమ్స్​లో కొత్త ఎస్​యూవీని బుక్​ చేసుకోవచ్చు. అక్టోబర్​ 5న డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​పై ఇప్పటివరకు ఉన్న అప్​డేట్స్​ని ఇక్కడ తెలుసుకుందాము..

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్​లిఫ్ట్- మార్పులు ఇవే..!

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్​లిఫ్ట్ ఎక్స్​టీరియర్​లో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది. గ్రిల్, హెడ్​ల్యాంప్​లతో పాటు అప్​డేటెడ్ ఫ్రెంట్ ఫ్యాసియాతో పాటు ఫ్రెంట్​, రేర్​ బంపర్​కు రీడిజైన్ చేయడం జరుగుతుంది. టెయిల్ లైట్లు కూడా కొత్త డిజైన్​ను పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా, నిస్సాన్ ఇప్పటికే సూచించినట్లుగా, ఫేస్​లిఫ్ట్ మోడల్ కొత్త డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్​తో వస్తుంది. లోయర్ స్పెక్ మోడళ్లు కొత్త ప్లాస్టిక్ వీల్ కవర్ డిజైన్​ను పొందుతాయని భావిస్తున్నారు.

సింగిల్ ప్యాన్ ఎలక్ట్రిక్ సన్​రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లేతో కూడిన భారీ 9 ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టెమ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, డ్రైవర్ కోసం 7 ఇంచ్​ డిజిటల్ డిస్​ప్లే వంటి కొన్ని కొత్త ఫీచర్ల రూపంలో ఈ నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​ ఎస్​యూవీ క్యాబిన్ కొన్ని నవీకరణలను పొందే అవకాశం ఉంది. డ్యాష్​బోర్డు కోసం కొత్త మెటీరియల్, సీట్ల కోసం కొత్త అప్​హోలిస్టరీ కూడా ఉండవచ్చు.

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్​లిఫ్ట్: ఇంజిన్​..

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్​లిఫ్ట్​ ఇంజిన్​లో మార్పులు కనిపించవని తెలుస్తోంది. ప్రస్తుత మోడల్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ లేదా టర్బోఛార్జ్డ్ యూనిట్ ద్వారా పనిచేస్తుంది. రెండూ మూడు సిలిండర్ల ఇంజిన్లు. 1.0-లీటర్ సామర్థ్యం కలిగి ఉంటాయి.

నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 71బీహెచ్​ప పవర్, 96ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బోఛార్జ్​డ్ యూనిట్ 98బీహెచ్​పీ పవర్, 160ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 5-స్పీడ్ మేన్యువల్ గేర్​బాక్స్ లేదా 5-స్పీడ్ ఏఎమ్​టీతో కనెక్ట్ చేసి​ ఉంటుంది. మరోవైపు, టర్బోఛార్జ్డ్ ఇంజిన్ 5-స్పీడ్ మేన్యువల్ గేర్​బాక్స్​ లేదా సీవీటి ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ పొందుతుంది.

ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభమై రూ.11.27 లక్షల వరకు ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్.

నిస్సాన్ మాగ్నైట్ గ్లోబల్ ప్రొడక్ట్​గా ఉంటుందని కంపెనీ గతంలో వెల్లడించింది. నిస్సాన్ మోటార్ ఇండియా తన టీజర్​ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని నొక్కి చెప్పింది, "ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్న ఎస్​యూవీని డ్రైవ్ చేయండి. ఒక కారు.. ఒకే ప్రపంచం. త్వరలోనే వస్తాను," అని పేర్కొంది.

హెచ్​టీ ఆటోతో ఇటీవల జరిగిన సంభాషణలో నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ సౌరభ్ వత్స మాట్లాడుతూ.. రాబోయే కొత్త మోడల్​తో, నిస్సాన్ మోటార్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్​ని 40 దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాలని యోచిస్తోందని, ఇందులో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్లు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విధంగా నిస్సాన్ మాగ్నైట్ గ్లోబల్ కారుగా మారుతుందని, దీనిని భారతదేశంలో రూపొందించి తయారు చేస్తామని వత్స పేర్కొన్నారు.

మాగ్నైట్ ఫేస్​లిఫ్ట్.. నిస్సాన్ మోటార్ ఇండియా తిరిగి ట్రాక్​లోకి తీసుకు రావడానికి కీలకంగా పనిచేస్తుందని సంస్థ భావిసతోంది. గత కొంత కాలంగా నిస్సాన్ వెనుకంజలో ఉన్నప్పటికీ, కంపెనీ ఇప్పుడు తన కొత్త ప్రణాళికతో మార్కెట్​కు సేవలందించడానికి కట్టుబడి ఉందని వత్స నొక్కి చెప్పారు.

సంబంధిత కథనం