Nissan X-Trail : ఫార్చ్యునర్​కి పోటీగా నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్​.. లాంచ్​ ఎప్పుడంటే..-nissan motor to launch the new x trail suv on this date check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nissan X-trail : ఫార్చ్యునర్​కి పోటీగా నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్​.. లాంచ్​ ఎప్పుడంటే..

Nissan X-Trail : ఫార్చ్యునర్​కి పోటీగా నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్​.. లాంచ్​ ఎప్పుడంటే..

Sharath Chitturi HT Telugu
Jun 25, 2024 02:29 PM IST

Nissan X-Trail price in India : 2024 నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్​ లాంచ్​కు రెడీ అవుతోంది. ఫార్చ్యునర్​కు పోటీగా వస్తున్న ఈ ఎస్​యూవీ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

2024 నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్​
2024 నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్​

2024 Nissan X-Trail SUV : ఇండియా ఆటోమొబైల్​ సెక్టార్​లో క్రేజీ డిమాండ్​ ఉన్న ఎస్​యూవీ సెగ్మెంట్​పై ఫోకస్​ చేసిన నిస్సాన్​ మోటార్​.. 2024 నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్​ని లాంచ్​ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఎస్​యూవీకి సంబంధించిన ఈవెంట్​ని జులై 17న నిర్వహిస్తోంది సంస్థ. అక్కడి నుంచి కొన్ని వారాల తర్వాత.. ఇండియాలో ఈ మోడల్​ లాంచ్​ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

2024 నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్ ఎస్​యూవీ విశేషాలు..

ఈ 2024 నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్​ ఎస్​యూవీని దాదాపు రెండేళ్ల క్రితం ప్రపంచానికి పరిచయం చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఎట్టకేలకు ఇది లాంచ్​కు సిద్ధమైంది. ఇక ఇండియాలో.. ఈ మోడల్​.. టయోటా ఫార్చ్యునర్​, ఎంజీ గ్లాస్టర్​కి పోటీగా అడుగుపెట్టనుంది.

వాస్తవానికి ఈ నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్.. ఒకప్పుడు ఇండియాలో అందుబాటులో ఉండేది. కానీ దానిని సంస్థ డిస్కంటిన్యూ చేసింది. 2005లోనే ఇది ఇండియాలో లాంచ్​ అయ్యి, మంచి గుర్తింపును సంపాదించుకుంది.

2022లో కొత్త నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్​ని సంస్థ అంతర్జాతీయ మార్కెట్​లో ప్రదర్శించింది. ఇండియాలో కూడా లాంచ్​ చేసేందుకు చూస్తున్నట్టు పేర్కొంది. ఎట్టకేలకు ఇండియాలో లాంచ్​ అవ్వనుంది. లాంచ్​కి ముందు.. అనేకమార్లు ఈ ఎస్​యూవీ టెస్ట్​ డ్రైవ్​ కూడా జరిగింది.

ఈ 2024 నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్ పొడవు 4680ఎంఎం. వెడల్పు 2065ఎంఎం. ఎత్తు 1725ఎంఎం. వీల్​బేస్​ 2705ఎంఎం. గ్రౌండ్​ క్లియరెన్స్​ 205ఎంఎం. ఇండియాలో లాంచ్​ అయ్యే మోడల్​లో డైమెన్షన్స్​ కొద్దిగా మారే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో.. ఈ ఎక్స్​-ట్రయల్​.. 5 సీటర్​, 7 సీటర్​ ఆప్షన్స్​లో లభిస్తోంది. మరి ఇండియాలో ఈ రెండు ఆప్షన్స్​ ఉంటాయా? లేక ఒకటే వస్తుందా? చూడాలి.

ఈ 2024 నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్ ఎస్​యూవీని సీఎంఎఫ్​-సీ ప్లాట్​ఫామ్​పై సంస్థ రూపొందిస్తోంది. ఇందులో సంస్థకు చెందిన ఈ-పవర్​ డ్రైవ్​ సిస్టెమ్​ ఉంటుంది. ఇది.. హై-ఔట్​పుట్​ బ్యాటరీ, ఇంజిన్​ ఇంటిగ్రేషన్​కి పెట్టింది పేరు!

ఈ-పవర్​ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ ఇంజిన్​.. 201 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఆల్​ వీల్​ డ్రైవ్​ ఈ-పవర్​ వేరియంట్​.. 211 హెచ్​పీ పవర్​ని ఆఫర్​ చేస్తుంది. మైల్డ్​ హైబ్రీడ్​ వేరియంట్​లో 12వీ మైల్డ్​ హైబ్రీడ్​ టెక్నాలజీ ఉంటుంది. ఇది 160 హెచ్​పీ పవర్​, 300 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

ఈ 2024 నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్​ని సీబీయూ (కంప్లీట్లీ బిల్ట్​ యూనిట్​)గా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఫలితంగా.. ఈ ఎస్​యూవీ ధర కాస్త ఎక్కువే ఉండొచ్చు!

ఇందాక చెప్పినట్టు.. టయోటా ఫార్చ్యునర్​, ఎంజీ గ్లాస్టర్​కు ఈ ఎస్​యూవీ గట్టి పోటీని ఇస్తుంది. వీటితో పాటు హ్యుందాయ్​ టుక్సాన్​, వోక్స్​వ్యాగన్​ టైగన్​, సిట్రోయెన్​ సీ5 ఎయిర్​క్రాస్​లకు సైతం మంచి పోటీ ఇస్తుంది ఈ నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్.

ఈ నిస్సాన్​ ఎస్​యూవీ ఫీచర్స్​, ధరతో పాటు ఇతర వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. సంస్థ నుంచి త్వరలోనే ఒక అప్డేట్​ వస్తుందని సమాచారం.

ఇంకో విషయం! ఇప్పుడు హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​లో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ తెలుకునేందుకు.. హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వండి!

Whats_app_banner

సంబంధిత కథనం